అప్పుల్లో ఏపీ మొదటి స్థానం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

అప్పుల్లో ఏపీ మొదటి స్థానం.. రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రైతులను ఆదుకోవడంలో జగన్ సర్కార్ విఫలమైందని అన్నారు. తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

New Update
అప్పుల్లో ఏపీ మొదటి స్థానం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

Chandra Babu: రైతులను, కౌలు రైతులను,చూస్తే గుండె తరుక్కుపోతుందని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈరోజు తెనాలి మండలం నందివెలుగులో తుఫాన్ ప్రభావంతో నీట మునిగిన పంటపొలాలను ఆయన పరిశీలించారు. పంటల నష్టంపై క్షేత్ర స్థాయి పర్యటించి అధ్యయనం చేసి ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి న్యాయం చేసే విధంగా చూస్తామని పేర్కొన్నారు.

ఈ తుఫాన్ అసాధారణమైనది... ఇది భయంకరమైన పరిస్థితని.. గతంలో నారుమళ్లు పోయాయి... ఇప్పుడు తుఫాన్ వల్ల చేతికి పంట వచ్చే సమయంలో నేలపాలు అయ్యిందని అన్నారు. కౌలు రైతులను చూస్తే బాధ వేస్తుందని.. 90శాతం పంట నీళ్ళ పాలు అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. తుఫాన్ ని నిలవరించలేము కానీ ముందస్తు చర్యలు వల్ల నష్ట నివారణ చర్యలు తీసుకోవచ్చని.. ప్రభుత్వం ముందస్తు చర్యల్లో విఫలం అయ్యిందని ధ్వజమెత్తారు.

ALSO READ: నా ఫోన్ హ్యాక్ చేశారు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

ప్రభుత్వం ఇంత టెక్నాలజీ ఉన్నా ఉపయోగించుకోవటం విఫలం అయ్యిందని పేర్కొన్నారు. రైతులకు గోతాలు కూడా ఇవ్వలేని దుర్బర స్థితిలో ఉందని ఫైర్ అయ్యారు. పంటలు నీళ్లలో మునిగి మూడు రోజులు అయిన డ్రెయిన్లు కూడా శుభ్రం చేయకపోవటం చూస్తే రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉంది అర్థం చేసుకోవచ్చని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పశల్ భీమాకి రాష్ట్రప్రభుత్వం డబ్బులు ఇచ్చి ఉంటే రైతులకు పంట నష్టం క్రింద డబ్బులు వచ్చేవని అన్నారు. జగన్ రైతులను పరామర్శించటానికి చుట్టపు చూపుగా చూడటానికి తిరుపతి వస్తున్నాడని విమర్శించారు. తుఫాన్ వచ్చింది ఈపక్క ఆయన తిరిగేది ఇంకోపక్క అని ఎద్దేవా చేశారు. రైతులను పరామర్శించేందుకు ఇక్కడికి వస్తే నాతో తిరగాల్సి వస్తుందని అటు తిరుగుతున్నాడని అన్నారు.

జగన్ వల్ల రాష్ట్రం చాలా నష్టపోయిందని ఆరోపించారు. రైతుతో మాట్లాడాను... పెట్టుబడిలో 20శాతం కూడా ఆదాయం రాని పరిస్థితి ఉందని వారు చెప్పినట్లు పేర్కొన్నారు. అప్పుల్లో మొదటి స్థానం ఏపీ ఉందని అన్నారు. కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానం ఉందని తెలిపారు. గతంలో నష్టపరిహారం క్రింద ఎకరాకు 20వేలు ఇచ్చారు... ఇప్పుడు 40వేలు ఇవ్వాలి ఒక్క రూపాయి కూడా ఇవ్వని పరిస్థితి కనిపిస్తుందని అన్నారు.

ALSO READ: కవిత, కేటీఆర్ జైలుకే.. సుఖేష్ చంద్రశేఖర్ బహిరంగ లేఖ

Advertisment
Advertisment
తాజా కథనాలు