TATA Satillite: అంతరిక్షంలో టాటా సైనిక ఉపగ్రహం.. ఇది ఎలా పనిచేస్తుందంటే.. 

దేశంలోనే తొలిసారిగా ప్రైవేట్ రంగంలో తయారైన ఉపగ్రహం తన సేవలు అందించడానికి సిద్ధమైంది. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ తయారు చేసిన TSAT-1Aను విజయవంతంగా భూకక్ష్యలోకి స్పేస్‌ఎక్స్‌ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రవేశ పెట్టారు. దీన్ని సైన్యం గూఢచారి ఉపగ్రహంగా ఉపయోగించుకుంటుంది. 

New Update
TATA Satillite: అంతరిక్షంలో టాటా సైనిక ఉపగ్రహం.. ఇది ఎలా పనిచేస్తుందంటే.. 

టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ నిర్మించిన మిలిటరీ గ్రేడ్ జియోస్పేషియల్ ఉపగ్రహం TSAT-1Aను  విజయవంతంగా భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఇది చాలా ఎక్కువ రిజల్యూషన్ కలిగిన భూ పరిశీలన ఉపగ్రహం(TATA Satillite). అమెరికాకు చెందిన ఎలోన్ మస్క్‌- స్పేస్‌ఎక్స్‌ కంపెనీ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా టాటారాకు చెందిన టిసాట్-1ఏ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఫాల్కన్ 9 రాకెట్ టాటా సిద్ధం చేసిన ఈ ఉపగ్రహంతో సహా వివిధ ఉపగ్రహాలను ఫ్లోరిడా రాష్ట్రంలోని కెన్నెడీ స్పేస్ సెంటర్‌లోని నాభాకు తీసుకువెళ్లింది. ఇక Tisat-1A అనేది మనదేశంలో పూర్తిగా ప్రైవేట్ సంస్థ నిర్మించిన  మొదటి మిలిటరీ గ్రేడ్ జియోస్పేషియల్ ఉపగ్రహం.

కోలార్‌లోని వేమగల్‌లోని టాటా యూనిట్‌లో ఈ ఉపగ్రహాన్ని(TATA Satillite) తయారు చేశారు. ఇది 50 కిలోల కంటే తక్కువ బరువు ఉంటుంది. ఈ ఉపగ్రహం ప్రతి పిక్సెల్‌కు ఒక మీటర్ కంటే ఎక్కువ ఖచ్చితత్వంతో అధిక రిజల్యూషన్ చిత్రాలను అందించగలదు. ఇది ప్రస్తుతం స్థిర కక్ష్యలోకి విజయవంతంగా చేర్చారు. రాబోయే రోజుల్లో ఇది ఎంత ప్రభావవంతంగా పని చేస్తుందో పరీక్షించిన తర్వాత దాని నిజమైన ప్రయోజనం కోసం ఉపయోగిస్తారు. 

టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్‌ తయారు చేసిన ఈ ఉపగ్రహం(TATA Satillite) సర్వీసులు ప్రస్తుతానికి భారత ప్రభుత్వానికి - సాయుధ దళాలకు మాత్రమే పరిమితం చేశారు. దీని ప్రెసిషన్ ఇమేజింగ్ సామర్ధ్యం మిలిటరీకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని సైన్యం గూఢచారి ఉపగ్రహంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. 

Also Read: ఆ నాలుగు కంపెనీలకు షాకిచ్చిన ఆర్బీఐ.. రిజిస్ట్రేషన్లు రద్దు!

ఇస్రో కొన్ని సైనిక గూఢచారి ఉపగ్రహాల(TATA Satillite)ను గతంలో అంతరిక్షలోకి పంపింది. గూఢచారి ఉపగ్రహాలు ఇప్పుడు ప్రైవేట్ రంగం నుండి కూడా ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నాయి. సరిహద్దులో చైనా నుంచి ముప్పు గతంలో కంటే ఎక్కువగా ఉన్నందున ఈ గూఢచారి ఉపగ్రహాలు సైన్యానికి వరంగా మారతాయని భావిస్తున్నారు.  టాటా అటువంటి మిలిటరీ గ్రేడ్ జియోస్పేషియల్ ఉపగ్రహాల(TATA Satillite) సముదాయాన్ని పెంచే ఆలోచనలో ఉంది. వేమగల్‌లోని దాని యూనిట్ సంవత్సరానికి 25 ఉపగ్రహాలను తయారు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ ఉపగ్రహాలను ప్రభుత్వం కోసమే కాకుండా వాణిజ్యపరంగా కూడా ఉపయోగించాలని టాటా భావిస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు