TATA Group: ఫ్రెంచ్ ఎయిర్‌బస్ తో టాటా గ్రూప్.. భారత్ లో హెలికాప్టర్ల తయారీ గుజరాత్ లోని వడోదర లో టాటా గ్రూప్ ఫ్రెంచ్ సంస్థ ఎయిర్‌బస్ తో కలిసి భారతదేశంలో H125 సింగిల్ ఇంజన్ హెలికాప్టర్‌ను తయారు చేయడానికి ఒప్పందం కుదిరింది. ఈ హెలీకాప్టర్లను వాణిజ్య అవసరాల కోసం ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. By KVD Varma 26 Jan 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి TATA Group: టాటా గ్రూప్ అలాగే ఫ్రెంచ్ విమానాల తయారీ కంపెనీ ఎయిర్‌బస్ కలిసి భారతదేశంలో H125 సింగిల్ ఇంజన్ హెలికాప్టర్‌ను తయారు చేయనున్నాయి. గుజరాత్‌లోని వడోదరలో ఈ హెలికాప్టర్లను తయారు చేసేందుకు రెండు కంపెనీల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ హెలికాప్టర్లను వాణిజ్య అవసరాల కోసం తయారు చేయనున్నారు. TATA Groupనకు చెందిన టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ కంపెనీ (టీఏఎస్ఎల్) ఈ హెలికాప్టర్ల అసెంబ్లింగ్ లైన్‌ను నిర్వహిస్తుంది. ఆసక్తిగల కొనుగోలుదారుల నుండి మార్కెట్‌లో ఇప్పటికే 600 నుండి 800 హెలికాప్టర్లకు డిమాండ్ ఉందని ఈ విషయంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపినట్లు ది ఎకనామిక్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. ఈ హెలికాప్టర్లను గుజరాత్‌లోని వడోదరలో తయారు చేయనున్నారు. టాటా -ఎయిర్‌బస్‌లు ఇప్పటికే ఇక్కడ సంయుక్తంగా 40 C295 రవాణా విమానాలను తయారు చేస్తున్నాయి. ఇప్పుడు ఈ హెలికాప్టర్లు వాణిజ్య అవసరాల కోసం నిర్మిస్తారు. ఈ సింగిల్ ఇంజన్ H130 హెలికాప్టర్లను మెడికల్ ఎయిర్‌లిఫ్ట్, నిఘా మిషన్లు, VIP విధులు, సందర్శనా సేవలకు ఉపయోగిస్తారు. భారతదేశం - ఫ్రాన్స్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జనవరి 26న ఈ ఒప్పందాన్ని ప్రకటించనున్నారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ జనవరి 26న రిపబ్లిక్ డే కార్యక్రమానికి హాజరు అవుతున్నారు. ఈసారి గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా మాక్రాన్‌ను భారత్ ఆహ్వానించింది. Also Read: ఏబీవీపీ నుంచి పద్మవిభూషణ్ దాకా వెంకయ్య నాయుడి తిరుగులేని ప్రస్థానం TATA Group - ఎయిర్‌బస్ ఇప్పటికే గుజరాత్‌లోని వడోదరలో సి295 విమానాలను తయారు చేస్తున్నాయి. సెప్టెంబర్ 2021లో, భారతదేశం సుమారు రూ. 21,000 కోట్ల విలువైన ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ (ADSpace)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో పాత అవ్రో-748 స్థానంలో సీ-295 విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదిరింది. 56 విమానాల కోసం డిమాండ్ చేశారు. వాటిలో 40 గుజరాత్‌లోని వడోదరలో నిర్మిస్తున్నారు. ఇప్పుడు దీనితో పాటు H125 సింగిల్ ఇంజన్ హెలికాప్టర్‌ను తయారు చేయనున్నారు. టాటా ఎయిర్‌బస్ నుండి 250 విమానాలను కొనుగోలు చేసింది. TATA Groupఎయిర్ ఇండియా తన ఫ్లీట్ - నెట్‌వర్క్‌ను విస్తరించడానికి ఫిబ్రవరి 2023లో ఫ్రెంచ్ కంపెనీ ఎయిర్‌బస్ నుండి 250 విమానాలను ఆర్డర్ చేస్తున్నట్లు ప్రకటించింది. Watch this interesting Video: #tata-group #airbus మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి