Onion Soup : వేడి వేడి టేస్టీ ఆనియన్ సూప్.. ట్రై చేయండి అదిరిపోతుంది జలుబూ, దగ్గు సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి సూప్స్ మంచి ఆప్షన్. సూప్స్ ద్వారా శరీరానికి పుష్కలమైన పోషకాలు అందుతాయి. ఇప్పుడు టేస్టీ, హెల్తీ ఆనియన్ సూప్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. పూర్తి రెసిపీ కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 03 Mar 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Onion Soup Benefits : సాధారణంగా జ్వరం(Fever), జలుబు(Cold), దగ్గు(Cough) వంటి సమస్యలు వచ్చినప్పుడు.. ఆహరం అంతగా సహించదు. సాలిడ్ ఫుడ్స్ కంటే కూడా లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలనిపిస్తుంది. ముఖ్యంగా వేడి వేడి సూప్స్ తాగడానికి ఇష్టపడతారు చాలా మంది. అయితే సూప్స్ లో చాలా రకాలు ఉంటాయి. వాటిలో ఒకటి ఆనియన్ సూప్(Onion Soup). దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము.. ఆనియన్ సూప్ కోసం కావాల్సిన పదార్థాలు ½ కప్పు: వెన్నె, 2 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, 4 కప్పులు: ఉల్లిపాయ ముక్కలు, 1 టీ స్పూన్ మిరియాలు, వైట్ సాస్ , చీజ్, ఆనియన్ సూప్ తయారీ విధానం మీడియం మంట పై ఒక పాన్ పెట్టి.. దాంట్లో ఆలివ్ ఆయిల్ తో వెన్నను కరిగించండి. ఇప్పుడు ఈ నూనెలో సన్నగా తరగిన ఉల్లిపాయ ముక్కలను వేసి కాస్త రంగు వచ్చే వరకు వేయించాలి. పూర్తిగా బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఉంచకూడదు. ఆ తర్వాత ఈ మిశ్రమంలో 3 కప్పుల నీళ్లు, అలాగే సరిపడ ఉప్పు వేసి బాగా కలిపి... 8 నిమిషాల పాటు మీడియం మంట పై ఉడికించాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత.. బ్లెండర్ తో స్మూత్ టెక్షర్ వచ్చే వరకు మెత్తగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మెత్తగా చేసిన ఈ మిశ్రమాన్ని ఒక పాన్ లోకి ట్రాన్స్ఫర్ చేసి.. దాంట్లో వైట్ సాస్, పెప్పర్ వేసి బాగా కలిపి ఒక 3-4 నిమిషాల పాటు మీడియం మంట పై ఉంచాలి. మధ్య మధ్యలో ఈ మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి. అంతే సింపుల్ టేస్టీ, హెల్తీ ఆనియన్ సూప్(Healthy Onion Soup) రెడీ. వేడి వేడిగా తాగితే.. నోటికి మంచి రుచిని ఇస్తుంది. ఇది కూడా చదవండి : పడుకునే ముందు బెల్లం తింటే.. ఈ వ్యాధులు పరార్! #health-benefits #health-problems #onion-soup-recipe #tasty-and-healthy-onion-soup మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి