Speaker: చంద్రబాబు నిప్పు అయితే నిరూపించుకోవాలి

టీడీపీ అధినేత చంద్రబాబుపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి పుంకాలు, పుంకాలుగా బయటకు వస్తున్నాయన్నారు. సమాజంలో న్యాయ వ్యవస్థ కన్నా, రాజకీయ వ్యవస్థ కన్నా, మీడియా వ్యవస్థ కన్నా పౌరుడు గొప్పవాడన్నారు.

New Update
Speaker: చంద్రబాబు నిప్పు అయితే నిరూపించుకోవాలి

టీడీపీ అధినేత చంద్రబాబుపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి పుంకాలు, పుంకాలుగా బయటకు వస్తున్నాయన్నారు. సమాజంలో న్యాయ వ్యవస్థ కన్నా, రాజకీయ వ్యవస్థ కన్నా, మీడియా వ్యవస్థ కన్నా పౌరుడు గొప్పవాడన్నారు. చంద్రబాబు తాను ఉప్పు, పప్పు అంటున్నాడని తెలిపిన తమ్మినేని.. బాబు నిప్పు అని నిరూపించుకోవాలని, ఎవరు ఏమీటనేది ప్రజలే నిర్ణయిస్తారన్నారు. తాము చంద్రబాబు గురించి ఎవరికీ చెప్పనవసరం లేదన్న ఆయన.. చంద్రబాబు అవినీతిపై మీడియానే ప్రజలకు వివరిస్తున్నాయన్నారు.

చంద్రబాబు వేదాలు వల్లిస్తున్నారని తమ్మినేని సీతారాం తెలిపారు. అక్టోబర్‌ 2న దీక్ష చేయడం వల్ల సత్యాగ్రహ అర్దం పరమార్దం దెబ్బతిన్నాయన్నారు. అవినీతికి పాల్పడ్డ చంద్రబాబు బేయిల్ ఇవ్వమని దీక్ష చేయడం ఏంటని ప్రశ్నించారు. ఆర్దిక నేరగాడు సత్యాగ్రహణం చేయడం ఏంటన్న ఆయన.. చంద్రబాబు ఏమైనా దేశం కోసం పోరాటం చేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతి పరుడని జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ సైతం ఒప్పుకున్నారని తమ్మనేని మండిపడ్డారు.

టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి వస్తే తాను సైతం అవినీతికి పాల్పడుతానని పవన్ కళ్యాణ్‌ పరోక్షంగా ముందే చెప్పారన్నారు. రాష్ట్ర ప్రజలకు టీడీపీ-జనసేన పార్టీల మధ్య ఉన్న బంధం ఎలాంటిదో ఆర్దమైందన్న ఆయన.. రాష్ట్ర ప్రజలు మరోసారి టీడీపీకి ఓటు వేయరని జోస్యం చెప్పారు. టీడీపీ బలహీన స్థితిలో ఉందన్న తమ్మినేని సీతారాం.. టీడీపీ పగ్గాలు పవన్ కళ్యాణ్ తీసుకున్నారన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు కేంద్రంగా రాష్ట్రంలో రాజకీయాలు జరుగుతున్నాయన్నారు. చంద్రబాబు జైల్లో కూర్చొని పవన్‌ చేత వివాదాస్పద వ్యాఖ్యలు చేయిస్తున్నారని మండిపడ్డారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ap Weather Report: ఆ జిల్లాలలో పిడుగులతో భారీ వర్షాలు.. మరో మూడు రోజులు ఇంతే..

ఏపీలో మరో మూడు రోజులు విభిన్న వాతావరణం ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.ఉత్తరాంధ్రలో కొన్నిచోట్ల శని, ఆదివారం పిడుగులతో కూరిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

New Update
Rains

Rains

ఎండ వేడితో తీవ్ర ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాలను వరుణుడు పలకరిస్తున్నాడు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు పడుతున్నాయి. దీంతో పగటి పూట ఉష్ణోగ్రతలు, ఉక్కపోత తగ్గి జనం కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే కొన్నిచోట్ల మాత్రం ఎండ వేడి దంచికొడుతోంది. ఈ క్రమంలోనే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిస్థితులపై అప్ డేట్ ఇచ్చింది. రానున్న మూడు రోజులు కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. 

Also Read: Waqf land: దేశ భూభాగంలో 5% భూమి వక్ఫ్ బోర్డులదే.. 12వ శతాబ్దంలో మొదలై ఇప్పుడు 39లక్షల ఎకరాలు

ఏపీలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని. వాతావరణ అనిశ్చితి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.మరోవైపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో రేపు, ఎల్లుండి కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఆదివారం కాకినాడలో మోస్తారు వర్షాలు, సోమవారం అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. 

Also Read: LSG vs MI: ముంబై నిర్లక్ష్యం.. ఔట్ అప్పీల్ చేయనందుకు 56 పరుగులు అదనం!

దీంతో రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ సూచించారు. ప్రజలు చెట్లు క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని సూచించారు.మరోవైపు గురువారం ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. గురువారం ఏపీలోని 12 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే 23 ప్రాంతాల్లో 50మి.మీ పైగా వర్షపాతం నమోదైనట్లు సమాచారం. అలాగే మన్యం జిల్లా జియ్యమ్మవలసలో 39.9°C అధిక ఉష్ణోగ్రత నమోదైంది. 

భిన్నమైన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు వాతావరణ మార్పులకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మరోవైపు గురువారం రోజున గన్నవరం, కడప సహా పలుచోట్ల భారీ వర్షం పడింది. దీంతో రహదారులపై వరదనీరు ప్రవహించింది. అకాల వర్షాలతో పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. మరో మూడు రోజులు ఇలాంటి పరిస్థితే ఉండే అవకాశాలున్నాయి.

Also Read: malla reddy college: క్రికెట్ ఆడుతూ గ్రౌండ్‌లోనే మల్లారెడ్డి కాలేజీ స్టూడెంట్ మృతి.. వీడియో వైరల్

Also Read:  Trump Effect: పెద్దన్న నిర్ణయానికి ..ఏపీలో ఆక్వారంగం కుదేలు!

ap | weather | andhra pradesh weather | ap today weather update | ap-weather | AP Weather Alert | andhra-pradesh-weather-forecast | andhra-pradesh-weather-report | latest-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment