లంచాలతోనే ఆఫీసుకు రండి.. ఏపీలో తహసిల్దార్ నిర్వాకం.. వీడియో వైరల్

శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిర తహసిల్దార్ ముష్రా వలీ బహిరంగంగానే అవినీతికి పాల్పడుతున్న వీడియో వైరల్ అవుతోంది. రాముడి కాలంలోనూ లంచం ఉందని, ఏ నాయకుడు లంచం లేకుండా పనిచేశారో చూపించాలంటూ బాధితులపైనే అసహనం వ్యక్తం చేశాడు.

New Update
లంచాలతోనే ఆఫీసుకు రండి.. ఏపీలో తహసిల్దార్ నిర్వాకం.. వీడియో వైరల్

Mushra Vali : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా(Sri Satyasai District) లో ఓ ఆఫీసర్ బహిరంగంగానే అవినీతికి పాల్పడుతున్న సంఘటన సంచలనం రేపుతోంది. ఎలాంటి పనుల కోసమైనా సరే తహసిల్దార్(Tahsildar) కార్యాలయానికి లంచం తీసుకుని రావాలని స్వయంగా తహసిల్దార్ హుకుం జారీచేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఇక వివరాల్లోకి వస్తే శ్రీ సత్యసాయి జిల్లాలో మడకశిర తహసిల్దార్ ముష్రా వలీ భారీగా అవినీతికి పాల్పడుతున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూ సమస్య పరిష్కారాల కోసం వెళితే లంచాలు ఇవ్వాలని వేధిస్తున్నారని, ఇవ్వని వారి పనులను పెండిగ్ లో ఉంచి కాళ్లు అరిగేలా తహసిల్దార్ కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి : పవన్ కల్యాణ్ కు అంత సీన్ లేదనుకున్నా.. శ్రియారెడ్డి కామెంట్స్ వైరల్

అంతేకాదు ఉన్నతాధికారులు వచ్చినప్పుడు వారి ఖర్చులు ఎవరు భరించాలని స్వయంగా ముష్రా వలీ చెప్పడం విశేషం. కాగా కార్యాలయం నిర్వహణ ఖర్చులు ఎక్కడి నుంచి వస్తాయని, ఈనెల 13వ తేదీ టెక్స్ టైల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీత పర్యటన వచ్చినప్పుడు ఆమె భోజనం ఖర్చు లక్ష 70 వేల రూపాయలు అయిందని ముష్రావలి వాపోయాడు. అలాఏ రాముడి కాలంలోనూ లంచం ఉందని, ఏ ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి లంచం లేకుండా పనిచేశారో చూపించాలంటూ బాధితులపైనే అసహనం వ్యక్తం చేశాడు. అలాగే పై అధికారులు వచ్చినపుడు వాళ్ల కోసం అయ్యే  ఖర్చులు తన జీతం నుంచి ఇవ్వాలా అని ఎదురు ప్రశ్నించిన అధికారి.. అందుకే రైతుల నుంచి లంచాలు తీసుకుంటున్నానంటూ తెగెసి చేప్పేశాడు. ఇక ప్రస్తుతం తహసిల్దార్ మాట్లాడిన వివాదాస్పద వీడియో వైరల్ అవుతోంది.

ఇక దీనిపై స్పందిస్తున్న ప్రజలు.. రెవెన్యూ శాఖలో విచ్చలవిడిగా జరుగుతున్న అవినీతి బహిర్గతంగా కనిపిస్తుంటే పై అధికారులు ఏం చేస్తున్నారని వాపోతున్నారు. ఇంత బహిరంగంగా లంచం డిమాండ్ చేసే స్థాయికి రెవెన్యూ అధికారులు వచ్చారంటే వ్యవస్థ ఎంత దారుణంగా తయారైందో అర్థం చేసుకోవచ్చని, వెంటనే ఇలాంటి వారిని విధుల నుంచి శాశ్వతంగా తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Honey Bees Attack: పెళ్లికెళ్తే చచ్చేంతపనైంది.. తేనెటీగల దాడిలో స్పాట్‌లోనే 50 మంది!

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో పెళ్లిబృందపై తేనెటీగలు దాడి చేశాయి. డీజే సౌండ్‌తో ఊరేగింపుగా వెళ్తున్న పెళ్లివారిపై ఒక్కసారిగా దాడికి దిగాయి. ఈ దాడిలో 50 మంది గాయపడ్డారు. దీంతో వెంటనే బాధితులకు కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు.

New Update
Honey Bees Attack

Honey Bees Attack

ఏపీలోని పార్వతీపురంలో దారుణం జరిగింది. పెళ్లి కోసం వెళ్లిన జనాలు.. చావు అంచుల వరకు వెళ్లారు. ఊరు ఊరంతా డీజే పాటలకు డ్యాన్స్ వేస్తున్న సమయంలో తేనెటీగలు ఒక్కసారిగా అటాక్ చేశాయి. దీంతో పదుల సంఖ్యలో పెళ్లి బృందం హాస్పిటల్‌పాలైంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో పెళ్లిబృందపై తేనెటీగలు దాడి చేశాయి. డీజే సౌండ్‌తో ఊరేగింపుగా వెళ్తున్న పెళ్లివారిపై ఒక్కసారిగా దాడికి దిగాయి. ఈ తేనెటీగల దాడిలో సుమార్ 50 మంది గాయపడ్డారు. దీంతో వెంటనే బాధితులకు కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు.

వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వెంటనే బాధితుడిని పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం ఈ తేనెటీగల దాడిలో తీవ్రంగా గాయపడిన పెళ్లి వారు.. హాస్పిటల్‌లో నొప్పిని భరించలేక ఏడుస్తూ ఉన్నారు. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. 

గతంలో చావు దగ్గర సంఘటన

ఏపీలోని అల్లూరి జిల్లాలోని గన్నేరు కొయ్యపాడులో కొప్పుల పల్లాయమ్మ (86) మృతి చెందింది. దీంతో శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు అంతిమయాత్ర కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందులో భాగంగానే శవాన్ని పాడెపై ఎక్కించి తీసుకెళ్తుండగా.. అదే సమయంలో బాణాసంచా కాల్చారు. 

దీంతో అందులో కొన్ని టపాకాయలు పక్కనే ఉన్న చెట్టుపై పడ్డాయి. సరిగ్గా అక్కడే తేనెతుట్టు ఉండటంతో దానికి ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా చెల్లా చెదురయ్యాయి. అదే సమయంలో అంతిమయాత్రలో ఉన్న వారిపై ఏకదాటిగా దాడి చేశాయి. దీంతో అంతిమయాత్రలో పాల్గొన్నవారంతా మృతదేహాన్ని రోడ్డుపై వదిలేసి పరుగులు పెట్టారు. 

ఈ ఘటనలో దాదాపు 40 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిని సమీపంలోని గౌరీదేవి పేట PHCకి తరలించి చికిత్స అందించారు. ఇంకొంతమంది భద్రాచలంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఈ తేనెటీగల దాడి అనంతరం బంధువులు అంత్యక్రియలు పూర్తి చేశారు. దీంతో ఈ ఘటనతో చాలా మంది ఉలిక్కి పడ్డారు. చావుకు వెళ్తే చచ్చేంత పనైందిరా బాబు అంటూ పలువురు బందువులు మాట్లాడుకున్నారు. 

Honey Bees Attack | latest-telugu-news | telugu-news | viral-news

Advertisment
Advertisment
Advertisment