Kodali Nani: చంద్రబాబుకు వేల కోట్లు ఎక్కడివి.?
చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాల వ్యాపారంతో చంద్రబాబు వేల కోట్లు ఎలా సంపాధించారన్నారు. పోలీసులు తనను అరెస్ట్ చేస్తారని బాబు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.
చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాల వ్యాపారంతో చంద్రబాబు వేల కోట్లు ఎలా సంపాధించారన్నారు. పోలీసులు తనను అరెస్ట్ చేస్తారని బాబు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.
ఆయన బాబు మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలోనే అత్యంత అవినీతి పరుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం చంద్రబాబు మాత్రమే అని ఆయన ధ్వజమెత్తారు
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మంత్రి రజిని, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మధ్య విభేదాలు వైసీపీలో హాట్ టాపిక్ గా మారాయి. ఎమ్మెల్యేగా గెలిచినప్పటినుంచి మంత్రి రజినితో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలకు సఖ్యత లేదు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు చిలకలూరిపేటకు చెందిన మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ నుమొదటినుంచి ప్రోత్సహిస్తూ వచ్చారు. ఇదే మంత్రి రజిని ఎంపీ మధ్య విభేదాల కారణమైంది. తర్వాత ఎంపీ, మంత్రి వర్గాల మధ్య తరచూ వివాదాలు చోటు చేసుకోవడం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీయడం నియోజకవర్గంలో రొటీన్ గా మారాయి. ఎంపీ కనీస సమాచారం లేకుండా నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తారంటూ మంత్రి రజిని వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేసేవారు. ఈ నేపథ్యంలోనే నాలుగైదు సార్లు ఎంపీ, మంత్రి వర్గాలు మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయు.
రాష్ట్రంలో ఇసుకను బంగారం చేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమా అన్నారు. ఇసుకలో వైసీపీ నేతలు రూ. 40 వేల కోట్లు దోచేశారని ఆయన మండిపడ్డారు. మద్యం పేరిట రూ. 50 వేల కోట్లు దోచేశారని ఆయన ఆరోపించారు. బోండా ఉమా ఆధ్వర్యంలో విజయవాడలో ధర్నా చౌక్ లో ఇసుక సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన...
జీపీఎస్ పై ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ చర్చలు ముగిశాయి. చర్చలు సుహృద్బావ వాతావరణంలో జరిగాయని మంత్రి బొత్స సత్యానారాయణ వెల్లడించారు. మరికొన్ని అంశాలను చేర్చాలని ఉద్యోగ సంఘాలు అడిగాయన్నారు. అధ్యయనం చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పామని వెల్లడించారు. చంద్రబాబు ఢిల్లీ తిరుగుతున్నాడని అన్నారు. బీజేపీ గేట్లు తెరిస్తే దూరాలని చూస్తున్నాడన్నారు.
టీడీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అనకాపల్లికి చెందిన టీడీపీ నేత మలశాల భరత్ కుమార్, ఆయన తండ్రి విశాఖ డెయిరీ డైరెక్టర్ రమణారావు, ఆయన తల్లి మాజీ ఎంపీపీ ధనమ్మలు సీఎం క్యాంపు కార్యాలయంలో వైసీపీలో చేరారు. వారికి సీఎం జగన్ మోహన్ రెడ్డి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
జగన్ ఒక్క అవకాశం ఇస్తే చాలు... తమ సత్తా ఏంటో చూపించుకోవడానికి సిద్ధంగా ఉన్న వారసులకు.. జగన్ పచ్చ జెండా ఊపినట్టు తెలుస్తోంది. చాలాకాలంగా సీఎం జగన్ దగ్గర పెండింగ్ లో ఉన్న వారసుల రాజకీయ ఆరంగేట్రం లిస్టు కి లైన్ క్లియర్ అయినట్టు తాడేపల్లి లో టాక్ నడుస్తుంది. వైసీపీలో చాలామంది వారసులు తమ రాజకీయ అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నారు.. తమ తండ్రులు సత్తా చాటిన నియోజకవర్గం నుండి బరిలోకి దిగాలనుకుంటున్న వైసీపీ యువ నాయకుల లిస్ట్ వైసీపీ లో చాలానే ఉంది
ఓటర్ల జాబితాలో అవకతవకలపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య కొనసాగుతున్న వార్ ఢిల్లీకి చేరనుంది. బోగస్ ఓట్ల వ్యవహారంపై పరస్పరం ఫిర్యాదులు చేసేందుకు రెండు పార్టీలు ఇవాళ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC)ని కలవనున్నాయి. రెండు పార్టీల నేతలకు గంట వ్యవధిలో సీఈసీ అపాయింట్మెంట్లు ఇచ్చింది. కనీసం 60 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయని..ఇది చంద్రబాబు హయాంలోనే జరిగాయని వైసీపీ ఆరోపిస్తుండగా.. టీడీపీ సానుభూతిపరుల పేర్లను తొలగిస్తున్నారని టీడీపీ వాదిస్తోంది
వైసీపీ, బీజేపీలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. బీజేపీ వైసీపీ పేర్లు వేరుగా ఉన్నా రెండు పార్టీలు ఒకటేనన్నారు. ఏపీలో మోడీ దత్త పుత్రుడుగా జగన్ వ్యవహరిస్తున్నాడంటూ మండిపడ్డారు. డబుల్ ఇంజన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం విధానం ప్రకటించిందన్నారు. ఫెడరల్ వ్యవస్థను నాశనం చేసేందుకే ఈ డబుల్ ఇంజన్ విధానం ప్రవేశ పెట్టారన్నారు.