ఆధారాలు ఉంటే సీఐడీకి అందజేయాలి: విజయసాయి రెడ్డి!
ఏపీలో మద్యం గురించి గత కొంతకాలంగా విమర్శలు చేస్తున్న ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పై ఎంపీ విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వద్ద ఉన్న ఆధారాలను సీఐడీకి అందజేయాలని తెలిపారు.
ఏపీలో మద్యం గురించి గత కొంతకాలంగా విమర్శలు చేస్తున్న ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పై ఎంపీ విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వద్ద ఉన్న ఆధారాలను సీఐడీకి అందజేయాలని తెలిపారు.
వైసిపి నేతలు ఓటమి భయంతోనే టిడిపి నేతలపై దాడులకి తెగబడుతున్నారని లోకేష్ ఆరోపించారు. భీమవరం టీడీపీ గ్రామకమిటీ అధ్యక్షుడు మునిరత్నంపై వైసీపీ చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు హత్యాయత్నం దారుణమని మండిపడ్డారు.
కనిగిరి వైసీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న కుందూరు నాగార్జున రెడ్డి కే మళ్లీ అవకాశం ఇస్తున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటించారు. దీంతో బుర్ర మధుసూదన్ యాదవ్ వర్గీయులు నిరాశ చెందుతూ వైసీపీ కార్యక్రమం నుండి వెనుదిరిగారు.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి మాట్లాడుతున్నారా లేక తన బావ చంద్రబాబు ఉనికిని కాపాడాటానికి ఆమె మాట్లాడుతున్నారా అంటూ బాపట్ల ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు ప్రశ్నించారు.
వైసీపీ పాలనలో అవినీతి జరిగిందంటూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు. సీఎం జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. ఏ శాఖలో ఎలా అవినీతి జరిగిందో వివరిస్తూ మొత్తం 1,311 పేజీలతో పిటిషన్ దాఖలు చేశారు.
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. 'చంద్రబాబు ఏపీలో నిన్న మొన్నటి వరకు బస్సు యాత్రలు నిర్వహించాడు.. ఇప్పుడు జైలు యాత్ర చేస్తున్నాడు.. ఆయన బయటకు వచ్చేది లేదు. ఒకవేళ వచ్చినా 2024 ఎన్నికలకు ముందే చస్తాడు.' అని ఆయన షాకింగ్ కామెంట్ చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుకి రెప్పపాటు కాలంలో పెద్ద ప్రమాదమే తప్పింది. తెలంగాణ ఖమ్మం జిల్లాలో ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఆయన అశ్వారావు పేట వైపు నుంచి ఖమ్మం వైపు వెళ్తుండగా..ఆయన కాన్వాయ్ మీద ఒక్కసారిగా గోధుమ బస్తాలు కారు బానెట్ పై పడ్డాయి.
గురువారం ఏపీ కర్నూలు ఎమ్మిగనూరులో జగనన్న చేదోడు (Jagananna chedhodu) కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్(Jagan) పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రజక, నాయీ బ్రహ్మణ, టైలర్ల జీవితాల్లో మార్పు రావాలని వరుసగా నాలుగో ఏడాది ఈ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోంది.