కోడి కత్తి దాడి కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా!
కోడి కత్తి కేసు విచారణను ఏపీ హైకోర్టు ఈ నెల 23 కి వాయిదా వేసింది. ఆరోజేనే తమ వాదనలు వినిపిస్తామని నిందితుడు శ్రీను తరుఫున న్యాయవాది సలీం పేర్కొన్నారు.
కోడి కత్తి కేసు విచారణను ఏపీ హైకోర్టు ఈ నెల 23 కి వాయిదా వేసింది. ఆరోజేనే తమ వాదనలు వినిపిస్తామని నిందితుడు శ్రీను తరుఫున న్యాయవాది సలీం పేర్కొన్నారు.
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పై మరోసారి విరుచుకుపడ్డారు. జాతీయ నేతగా ఉన్న మీరు జాతి నేతగా ఎందుకు మారారు అంటూ ప్రశ్నించారు.
ఏపీలో కులగణన చేయాలని నిర్ణయించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 15 నుంచి 27లోపు డిజిటల్ విధానంలో కులగణన చేయడానికి సర్కారు నిర్ణయించింది. దీని కోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ని కూడా సిద్ధం చేస్తోంది.
ఏపీలో మద్యం గురించి గత కొంతకాలంగా విమర్శలు చేస్తున్న ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పై ఎంపీ విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వద్ద ఉన్న ఆధారాలను సీఐడీకి అందజేయాలని తెలిపారు.
వైసిపి నేతలు ఓటమి భయంతోనే టిడిపి నేతలపై దాడులకి తెగబడుతున్నారని లోకేష్ ఆరోపించారు. భీమవరం టీడీపీ గ్రామకమిటీ అధ్యక్షుడు మునిరత్నంపై వైసీపీ చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు హత్యాయత్నం దారుణమని మండిపడ్డారు.
కనిగిరి వైసీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న కుందూరు నాగార్జున రెడ్డి కే మళ్లీ అవకాశం ఇస్తున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటించారు. దీంతో బుర్ర మధుసూదన్ యాదవ్ వర్గీయులు నిరాశ చెందుతూ వైసీపీ కార్యక్రమం నుండి వెనుదిరిగారు.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి మాట్లాడుతున్నారా లేక తన బావ చంద్రబాబు ఉనికిని కాపాడాటానికి ఆమె మాట్లాడుతున్నారా అంటూ బాపట్ల ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు ప్రశ్నించారు.
వైసీపీ పాలనలో అవినీతి జరిగిందంటూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు. సీఎం జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. ఏ శాఖలో ఎలా అవినీతి జరిగిందో వివరిస్తూ మొత్తం 1,311 పేజీలతో పిటిషన్ దాఖలు చేశారు.
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. 'చంద్రబాబు ఏపీలో నిన్న మొన్నటి వరకు బస్సు యాత్రలు నిర్వహించాడు.. ఇప్పుడు జైలు యాత్ర చేస్తున్నాడు.. ఆయన బయటకు వచ్చేది లేదు. ఒకవేళ వచ్చినా 2024 ఎన్నికలకు ముందే చస్తాడు.' అని ఆయన షాకింగ్ కామెంట్ చేశారు.