Kesineni Nani : వైసీపీ తీర్థం పుచ్చుకోనున్న కేశినేని నాని.. ఇప్పటికే కొందరు సన్నిహితులతో..!
టీడీపీకి గుడ్ బై చెప్పిన కేశినేని నాని వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన జగన్ తో భేటీ కానున్నట్లు సమాచారం.
టీడీపీకి గుడ్ బై చెప్పిన కేశినేని నాని వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన జగన్ తో భేటీ కానున్నట్లు సమాచారం.
నన్ను రాజకీయంగా, భౌతికంగా అంతమొందించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఆస్ట్రేలియాకు సంబంధించిన ఓ సంస్థతో నన్ను తుదముట్టించేందుకు ఒప్పందం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
వైసీపీ నేత మంత్రి అమర్నాథ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే విషయం మీద ఉత్కంఠతకు తెరపడేటట్లు కనిపిస్తోంది. పెందుర్తి సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజ్ స్థానంలో అమర్నాథ్ను పోటీ చేయమని అదిష్టానం అడిగిందని..దానికి ఆయన కూడా పచ్చ జెండా ఊపారని తెలుస్తోంది.
ప్రొఫెషనల్ ఆటకు , రాజకీయాలకు సంబంధం ఉండకూడదు కాబట్టే నేను వైసీపీకి గుడ్ బై చెప్పినట్లు క్రికెటర్ అంబటి రాయుడు పేర్కొన్నారు. వైసీపీలో చేరిన పది రోజులకే పార్టీని విడడంతో వైసీపీ మీద ఇతర పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.
విశాఖ ఎంపీ అభ్యర్థిగా మంత్రి బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీని రంగంలోకి దించే ఆలోచనలో వైసీపీ ఉంది. గతంలో విజయనగరం ఎంపీగా పని చేశారు ఝాన్సి. సామాజిక సమీకరణాల దృష్ట్యా ఝాన్సీ పేరును జగన్ ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయం ఆసక్తికరంగా మారింది. జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం, పి.గన్నవరంలో ఇన్ఛార్జిలను వైసీపీ మార్చడంతో ఆ నలుగురు ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. త్వరలోనే వీరంతా పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది.
వైఎస్సార్ మరణం పట్ల అనుమానాలు ఉన్నాయని సజ్జల రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక చంద్రబాబు కుట్ర ఉందని ఆరోపించారు. చంద్రబాబు తనకేం కావాలో అందరితో కలిసి చేయిస్తాడని అన్నారు.
వైసీపీలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు అంశం హాట్ టాపిక్ గా మారింది. తనను గుంటూరు నుంచి పోటీ చేయాలని సీఎం జగన్ చెప్పారని.. కానీ తనకు నరసరావుపేట నుంచే పోటీ చేయాలని ఉందని ఆయన చెబుతుండడం పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తిరంగా మారింది.