వైసీపీ మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసులు!
AP: చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మరోసారి మాజీ మంత్రి జోగి రమేష్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 10గంటలకు విచారణకు మంగళగిరి డీఎస్పీ కార్యాలయంలో హాజరుకావాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. కాగా ఆయన ఇదే కేసులో ఇప్పటివరకు రెండుసార్లు విచారణకు హాజరయ్యారు.
YS Jagan : జగన్ ఇంటి వద్ద హైటెన్షన్
జగన్ ఇంటి వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తాడేపల్లిలోని ఆయన నివాసాన్ని బీజేపీ యువ మోర్చా నేతలు ముట్టడించారు. తిరుమల లడ్డూను అపవిత్రం చేశారని ఆందోళనకు దిగారు. జగన్ క్షమాపణలు చెప్పాలంటూ ఇంటి ముందు బైఠాయించారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేపట్టారు.
Balineni : మా డబ్బులతో జగన్.. పవన్ తో భేటీ తర్వాత బాలినేని సంచలనం!
మా డబ్బులతోనే గెలిచాం అయినా పార్టీ కోసం జగన్‌తో నడిచాం. జీవితాంతం గుండెల్లో ఉంటారని చెప్పారు. నమ్మించి మోసం చేశారంటూ పార్టీకి రాజీనామా చేసిన బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్దిసేపటి క్రితం పవన్ కల్యాణ్‌ను కలిసిన ఆయన జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
Chandrababu: తిరుపతి లడ్డూలో జంతు కళేబరం ఆయిల్.. సీఎం సంచలన వ్యాఖ్యలు!
వైసీపీ హయాంలో తిరుమల వెంకటేశ్వరుని పవిత్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నించారంటూ ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపణలు చేశారు. 'తిరుపతి ప్రసాదం, భోజనంలో నాసిరకమైన సరుకులు వాడారు. లడ్డూలో నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ వేశారన్నారు.
Janasena Party : జనసేనలోకి కీలక నేతలు..పవన్ వ్యూహం ఇదేనా?
ఆంధ్రాలో కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు ఒకొక్కరే పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు.వాళ్ళందరూ జనసేనలో జాయి అవుతున్నారు.దీనికి కారణం టీడీపీలో ఛాన్స్ లేకపోవడమా లేక జనసేనలో చేరితే నెక్స్ట్ టైమ్ పదవులు దక్కుతాయన్న ఆశా అనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది.
Eluru: ఏలూరులో వైసీపీకి మరో ఎదురు దెబ్బ!
ఏలూరు జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ ఘంటా పద్మశ్రీతో పాటు ఆమె భర్త వైసీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరావు కూడా వైసీపీ కి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే వైసీపీ మాజీ మంత్రి ఆళ్లనాని, మేయర్ నూర్జహాన్ దంపతులు కూడా వైసీపీ కి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/JOGI-RAMESH.jpg)
/rtv/media/media_files/WPr5txFkWyxdklUVpERn.jpg)
/rtv/media/media_files/cezGo83RROkJVGDINpi3.jpg)
/rtv/media/media_files/eN0OJb7TL0NuoBUh3nU5.jpg)
/rtv/media/media_files/U05RF6duwTFQLumMlg13.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/zp-chairman.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/Chandrababu-1-1.jpg)