Weather : తెలంగాణలో 5 రోజులు వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక
తెలంగాణలో అకాల వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. ఐదు రోజులపాటూ భారీ వర్షాలుపడొచ్చని తెలిపింది. ఈదురు గాలులు, వడగళ్ళతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది.
తెలంగాణలో అకాల వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. ఐదు రోజులపాటూ భారీ వర్షాలుపడొచ్చని తెలిపింది. ఈదురు గాలులు, వడగళ్ళతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది.
తెలంగాణ వాసులకు వాతావరణశాఖ ఓ చల్లటి వార్త చెప్పింది. రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వానలు పడే ఛాన్స్ ఉన్నట్లు ఐఎండీ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల భారీ నుంచి తేలికపాటి వర్షాలు కురిసేందుకు అవకాశాలున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ప్రస్తుతం సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ పరిస్థితికి కారణం ఎల్నినో ప్రభావం అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఎల్నినో ప్రభావం అంటే ఏమిటి? దీనివలన మన వాతావరణంలో వచ్చే మార్పులు ఏమిటి? వివరంగా ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు
మార్చి 2 వ వారం కూడా రాకముందే ఎండలు మండుతుండడంతో పాత రికార్డులను భానుడు తిరగరాస్తాడని వాతావరణశాఖాధికారులు తెలిపారు. మార్చి మొదటి వారంలోనే 36 డిగ్రీల వరకు ఉంటే రెండవ వారంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగి 40 డిగ్రీల వరకు చేరే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
తెలగు రాష్ట్రాల్లో ఇవాళ , రేపు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెబుతోంది వాతావరణ శాఖ. తెలంగాణ మీద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా అక్కడక్కడా జల్లులు కురుస్తాయని తెలిపింది.
చలి పెరగడం, తగ్గడం ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వారు చేపలు, వేరుశెనగ, సోయా, తమలపాకు వంటి పదార్థాలకు దూరంగా ఉండాలని తెలుపుతున్నారు.
మొహలీలో తీవ్రమైన చలి ఆటగాళ్లను ఇబ్బంది పెట్టిందని రోహిత్ శర్మ అన్నారు. 'మేము అనుకున్నదానికంటే ఎక్కువగానే చలి నమోదైంది. మ్యాచ్ జరుగుతున్నపుడు ఉష్ణోగ్రత దాదాపు 9 డిగ్రీలకు పడిపోయింది. బంతి తాకితే విపరీతమైన నొప్పి కలిగింది. ఇది కఠినమైన సవాల్' అని చెప్పారు.
దక్షిణభారతదేశం, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ వాతావరణాన్ని ఐఎండీ పరిశీలిస్తోంది. కొంతమేర తుఫాన్ విస్తరించిందని..లక్షద్వీప్ లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. నేడు ఏపీ, తెలంగాణలో వర్షాలు పడే ఛాన్స్ లేదు. చలిమాత్రం పెరుగుతుందని వెల్లడించింది.
మిచౌంగ్ తుఫాన్ తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపింది. తాజాగా మరో తుఫాన్ దక్షిణం నుంచి బయలుదేరింది. 24గంటల్లో అల్పపీడనంగా ఏర్పడనుంది. నేటి నుంచి 5రోజుల పాటు కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, లక్షద్వీప్ లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపనుంది.