Weather Alert: రాగల రెండ్రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
రాగల రెండ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
రాగల రెండ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
బెంగళూరు వాసులకు భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈ మేరకు బెంగళూరు నగరానికి యెల్లో అలర్ట్‌ను జారీ చేసింది. మే 16 నుంచి 21 వరకు వర్షాలు ఉంటాయని తెలిపింది.
ఈసారి మూడు రోజుల ముందుగానే రుతుపవనాలు రానున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. మే 22కు బదులు.. మే 19వ తేదీనే రుతుపవనాలు అండమాన్ నికోబార్‌ను తాకనున్నాయని పేర్కొంది. జూన్ 1లోగా కేరళకు రుతుపవనాలు చేరే అవకాశం ఉందని తెలిపింది.
తెలంగాణలో పలు ప్రాంతాల్లో రానున్న రెండ్రోజుల పాటు తేలిపాటి నుంచు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ప్రస్తుతం తెలంగాణ, రాయలసీమ, దక్షిణ కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు పేర్కొంది.
తెలంగాణలో మరో 3,4 రోజుల పాటు పగటిపూట ఉష్ణోగ్రతలు 46 నుంచి 48 డిగ్రీల సెల్సియస్‌కు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది తెలిపింది. ఇప్పటికే వడదెబ్బ కారణంగా రాష్ట్రంలో ఏడుగురు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.
దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఈరోజు (శుక్రవారం) మధ్యాహ్నం హైదరాబాద్ బేగంపేటలోని 43.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు ఐఎండీ వెల్లడించింది. కీసర, ఘట్కేసర్లో 45.1 డిగ్రీలు, చిల్కూరు, మోయినాబాద్లో 44.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వేసవి కాలం మొదలైనప్పటికీ.. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు, మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. అయితే తాజాగా భారత వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ చేసింది.
ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీర్ఘకాలిక సగటు వర్షాపాతం 87 సెంటీమీటర్లు ఉండగా.. ఈ ఏడాది 106 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.