TTD EO Shyamala Rao: టీటీడీ ఈవో శ్యామలరావు కీలక నిర్ణయం
AP: టీటీడీ ఈవో శ్యామలరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. 2023 ఆగస్టు 7వ తేదీ నుంచి 2024 మార్చి 11వ తేదీ వరకు జరిగిన 8 పాలకమండలి తీర్మానాలు టీటీడీ వెబ్సైట్లో పెట్టాలని ఈవో ఆదేశాలు ఇచ్చారు.
AP: టీటీడీ ఈవో శ్యామలరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. 2023 ఆగస్టు 7వ తేదీ నుంచి 2024 మార్చి 11వ తేదీ వరకు జరిగిన 8 పాలకమండలి తీర్మానాలు టీటీడీ వెబ్సైట్లో పెట్టాలని ఈవో ఆదేశాలు ఇచ్చారు.
ఏపీలో టీటీడీ ఛైర్మన్ ఎవరనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ రేసులో టీవీ5 అధినేత బీఆర్ నాయుడు, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు ఉన్నారు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి ఛైర్మన్ పదవి ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.
తిరుమలలో విజిలెన్స్ తనిఖీలలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి పెత్తనం బయటపడింది. ఒక రోజుకు పదుల సంఖ్యలో సిఫార్సు లేఖలు పంపినట్లు తెలుస్తోంది. 50 మందికి పైగా ప్రోటోకాల్, తోమాల, విఐపీ బ్రేక్, కళ్యాణం జరిపారు. మంత్రి ఆజ్ఞలతో దర్శనాలు కల్పిస్తూ వచ్చారు గత ఈవో ధర్మారెడ్డి.
తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. రెండు రోజుల క్రితం భక్తుల రద్దీ తగ్గినట్లు అనిపించినప్పటికీ.. మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది. శుక్ర, శని, ఆదివారాలు కావడంతో తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో చేరుకుంటున్నారు. వారాంతంలో తిరుమలలో భక్తుల రద్దీ అధికంగానే ఉంటుంది.
టీటీడీలో విజిలెన్స్ అధికారులు సోదాలు చేపట్టారు. శ్రీవారి దర్శనం టికెట్ల కేటాయింపు, శ్రీవాణి ట్రస్టులో అక్రమాలపై ఫిర్యాదుల ఆధారంగా తిరుమల, తిరుపతిల్లోని వివిధ విభాగాల్లో తనిఖీలు చేస్తున్నారు. గత ఐదేళ్లలో టీటీడీలో జరిగిన పనులపై విజిలెన్స్ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
ఏపీకి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిక కేఎస్ శ్రీనివాసరాజు వాలంటీరి రిటైర్మెంట్ తీసుకున్నారు.శ్రీనివాసరాజు డిప్యుటేషన్‌పై తెలంగాణలో నాలుగేళ్లకు పైగా విధులు నిర్వహించారు. ఆయన టీటీడీ ఈవోగా వెళ్లేందుకు ప్రయత్నించగా అది జరగకపోవడంతో ఆయన వీఆర్ఎస్ తీసుకున్నారు.
తిరుమల శ్రీవారి భక్తుల వసతి గదులకు సంబంధించి టీటీడీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మరింత సౌకర్యవంతంగా, పారదర్శకంగా వసతి అందించాలని టీటీడీ ఈవో శ్యామలరావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు
తిరుమలలో ప్రత్యేక దర్శనం, లడ్డూ ప్రసాదం ధరలు తగ్గినట్లు ప్రచారమవుతున్న వార్తలను టీటీడీ కమిటీ ఖండించింది. దళారులు, బ్రోకర్ల తప్పుడు ప్రచారం నమొద్దని భక్తులకు విజ్ఞప్తి చేసింది. ధరల్లో ఎలాంటి మార్పు లేదని, మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.