TG: పంచాయితీ ఎన్నికల బరిలో యువత జోరు..40 ఏళ్ళ లోపు వారే ఎక్కువ
తెలంగాణలో జరగనున్న పంచాయితీ ఎన్నికలలో ఈ సారి ఎక్కువగా యువత బరిలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. నామినేషన్ల పర్వం తర్వాత దరఖాస్తు చేసిన వారిలో 75 శాతం 40 ఏళ్ళ లోపువారే ఉన్నారని తెలుస్తోంది.
తెలంగాణలో జరగనున్న పంచాయితీ ఎన్నికలలో ఈ సారి ఎక్కువగా యువత బరిలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. నామినేషన్ల పర్వం తర్వాత దరఖాస్తు చేసిన వారిలో 75 శాతం 40 ఏళ్ళ లోపువారే ఉన్నారని తెలుస్తోంది.
ఉక్రెయిన్ తో యుద్ధాన్ని ముగించడంపై క్రెమ్లిన్ లో అమెరికా, రష్యాలు ఈ రోజు చర్చలు జరిపాయి. అయితే ఇందులో ఎటువంటి పురోగతి మాత్రం సాధించలేదు. మాస్కో తనదని చెప్పుకునే కైవ్ భూభాగాన్ని అప్పగించాలని పుతిన్ డిమాండ్ చేశారు.
వారం రోజులుగా పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన పార్టీ పీటీఐ ఈరోజు దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. దీంతో రావల్పిండిలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. అక్కడ 144 సెక్షన్ విధించారు.
బంగ్లాదేశ్ కు మూడుసార్లు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన ఖాలిదా జియా ఆరోగ్యం క్షీణించడంతో ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో వెంటిలేషన్ పై ఉన్నారు. జియా ఆరోగ్యంపై భారత ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.
వెనిజులా అధ్యక్షుడు మదురో వెంటనే తన పదవి నుంచి తప్పుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. దీనికి సమాధానంగా తాను దేశం నుంచి వెళ్ళిపోతానని..కానీ కొన్ని షరతులు మాత్రం అంగీకరించాల్సిందేనని మదురో అన్నారు.
భారత, పాకిస్తాన్ నియంత్రణ రేఖ ఎల్వోసీ వెంబడి 69 ఉగ్రవాద శిబిరాలు, 120 మంది దాకా ఉగ్రవాదులు యాక్టివ్ గా ఉన్నారని...వారు మన దేశంలోకి చొరబడడానికి ఎదురు చూస్తున్నారని బీఎస్ఎఫ్ ఇనెస్పెక్టర్ జనరల్ యాదవ్ చెబుతున్నారు.
తన ఒక కొడుకు పేరులో శేఖర్ అనే పేరును చేర్చామని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తెలిపారు. జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భార్య, కొడుకుల గురించి మాట్లాడారు. తన భార్య శివోన్ కు భారతీయ మూలాలున్నాయని చెప్పారు.
ఏఐ అభివృద్ధి, ఫీజుల పెంపు ప్రభావం ఈ సారి హెచ్-1బీ వీసాలపై పడింది. దీంతో ఈ ఏడాది హెచ్1 వీసాల ఆమోదం దారుణంగా పడిపోయింది. ముఖ్యంగా భారతీయ కంపెనీలు చాలా తక్కువగా వీసాలను దరఖాస్తు చేసుకున్నాయి.
సీనియర్లు రోహిత్, కోహ్లీ..కోచ్ గంభీర్ మధ్య చాలా రోజులుగా దూరం ఉంటున్నారు. గంభీర్ వల్లనే రో, కో లు ఇద్దరూ టెస్ట్ ల నుంచీ రిటైర్ అయ్యారనే వాదనలు కూడా ఉన్నాయి. వీరిద్దరూ ఇప్పుడు 2027 వరల్డ్ కప్ ఆడాలంటే కోచ్ గౌతీతో సయోధ్య తప్పదని అంటున్నారు.