TTD: ఎమ్మెల్యే కోటా ద్వారా తిరుమల శ్రీవారి దర్శనాలు పెంచిన ప్రభుత్వం
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా చిన్నశేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి విహరించారు.
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా చిన్నశేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి విహరించారు.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం కావడంతో కలియుగ ప్రత్యక్ష దైవం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు కొండకు పోటెత్తారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోవడంతో మిగిలిన భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు.
హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో మరోసారి కలకలం రేగింది. శ్రీవారి ఆలయంపై నుంచి మహాగోపురం మీదుగా మళ్లీ విమానం వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. దీంతో భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇలా విమానాలు ఏడుకొండల మీద చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే
బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ (Sharuk Khan) ఆయన కుమార్తె సుహానా ఖాన్(Suhana Khan) , జవాన్ (Jawan)సినిమా హీరోయిన్ , లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayana Tara)ముగ్గురు కూడా తిరుమల శ్రీవారిని(Tirumala) దర్శించుకున్నారు.
తిరుమల తిరుపతి వెంకన్న అంటే అందరికి ఎంతో ఇష్టమైన దేవుడు. రోజుకు ఎంతో మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. అంతేకాదు రాజకీయ ప్రముఖులతో పాటు సినిమా వాళ్లు సైతం తిరుమలకు వచ్చి స్వామివారి సేవలో పాల్గొంటారు. నేడు యంగ్ బ్యూటీ స్వామిని దర్శించుకున్నారు
నాస్తికుడంటూ తనపై విమర్శలు చేస్తున్న వారికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. తాను విమర్శలకు భయపడే వాడిని కాదన్నారు. తాను 17 సంవత్సరాల క్రితమే టీటీడీ చైర్మన్ అయిన వ్యక్తినన్నారు. మతాంతీకరణలు ఆపేందుకు కళ్యాణమస్తు ద్వారా సుమారు 30 వేల మందికి సామూహిక వివాహాలు చేయించానని భూమన వెల్లడించారు.
తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. అయితే సోమవారం తగ్గిన భక్తులు.. నేడు పెరిగారు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల నుంచి 10 గంటల సమయం పడుతోంది. భక్తులు 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
తిరుమల అలిపిరి నడకమార్గంలో మరో చిరుత బోనులో చిక్కింది. నరసింహస్వామి ఆలయానికి సమీపంలో అటవీశాఖ ఏర్పాటు చేసిన బోనులో నిన్న అర్థరాత్రి చిరుత చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. బాలిక లక్షిత పై దాడి చేసిన పరిసరాల్లో ఇటీవల ఓ చిరుతను పట్టుకొని జూ కు తరలించారు ఫారెస్టు అధికారులు. కొన్నిరోజుల వ్యవధిలోనే రెండో చిరుత బోనులో చిక్కుకోవడంతో ఉపశమనం లభించినట్లయ్యింది.