BIG BREAKING: డిసెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు..
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినేట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలనోత్సవాల తర్వాత ఈ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు ప్రజాపాలన వారోత్సవాలు జరగనున్నాయి.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినేట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలనోత్సవాల తర్వాత ఈ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు ప్రజాపాలన వారోత్సవాలు జరగనున్నాయి.
సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 45 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని తెలంగాణ సర్కార్ ప్రకటించింది.
బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. ఓడిపోయాం అంతే చచ్చిపోలేదు.. బీజేపీకి ఓటు వేసిన 17,056మంది కట్టర్ హిందువులకు ధన్యవాదాలు అని తెలిపారు.
కరీనంగర్ జిల్లా మానకొండూరు మండలంలో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిజామాబాద్ నుంచి వరంగల్ వెళ్తు్న్న ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టింది. సదాశివపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీవ్ యాదవ్.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై దాదాపు 25 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. బీఆర్ఎస్ ఓటమిపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ఖాన్‌పేట శివారులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వసతి గృహంలో ఉంటున్న వాచ్మెన్ ఫుల్‌గా మద్యం సేవించాడు. ఆ మత్తులో అన్నం వండిన పాత్రలో కాలుపెట్టి నిద్రించాడు. దీంతో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య వాచ్‌మెన్‌ను విధుల నుంచి తొలగించారు.