KTR Live: మా పాలన సంక్షేమానికి స్వర్ణయుగం.. మళ్లీ గెలిచేది మేమే: కేటీఆర్
రానున్న ఎన్నికల్లో మరో సారి తాము అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు హైదరాబాద్ లో ఆయన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రానున్న ఎన్నికల్లో మరో సారి తాము అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు హైదరాబాద్ లో ఆయన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ కొందరు నేతలకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. పార్టీలో చేరడమే ఆలస్యం అన్నట్లుగా పలువురు నేతలకు టికెట్లు కన్ఫామ్ చేసింది. మరికొందరు పేర్లను హోల్డ్ లో ఉంచినా.. వారికి కూడా కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇతర పార్టీల నుంచి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ దక్కించుకున్న నేతల్లో ప్రముఖంగా మునుగోడు - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పాలేరు - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం - తుమ్మల నాగేశ్వరరావు సహా తదితర నేతలు ఉన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై హాట్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కామారెడ్డిలో కేసీఆర్‌ను ఓడించే మొగోడు రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సాధించే తొలి విజయం కామారెడ్డే అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ తిన్నదంతా కక్కిస్తామన్నారు జీవన్ రెడ్డి. ప్రాజెక్టు విషయంలో కేసీఆర్‌కు అవగాహన లేకపోతే.. ఇంజనీర్లకు లేదా? అని ప్రశ్నించారు. ఈఎన్సీ మురళీధర్ రావును జైల్లో వేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో ఈసారి అధికారం తమదే అంటున్న కాంగ్రెస్ పార్టీ.. మరింత దూకుడు పెంచింది. పార్టీ అగ్ర నేతలను ప్రచార పర్వంలోకి దించింది. ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలంగాణకు వస్తున్నారు. అక్టోబర్ 28, 29 తేదీల్లో చేవెళ్ల, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేపట్టనున్నారు. చేవెళ్ల, పరిగి, తాండూరు, సంగారెడ్డి, నర్సాపూర్, మెదక్ లో వీరు ప్రచారం చేస్తారు.
తెలంగాణలో బీజేపీ గెలిస్తే బీసీ అభ్యర్థినే ముఖ్యమంత్రిగా నియమిస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన హాట్ డిస్కషన్‌కు తెరలేపింది. ఒకవేళ బీజేపీ గెలిస్తే సీఎం రేసులో నిలిచేది వీరే అంటూ కె. లక్ష్మణ్, ఈటల రాజేందర్, బండి సంజయ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతమైతే.. బీజేపీలో బలమైన బీసీ నేతలుగా వీరు ముగ్గురు చలామణి అవుతున్నారు. దీంతో వీరిలో ఎవరు సీఎం అవుతారు? అనే చర్చ నడుస్తోంది.
ఓ టీవీ చర్చా కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానంద.. బీజేపీ నేత కూన శ్రీశైలం గౌడ్ పై చేయి చేసుకోవడం రాష్ట్ర రాజకీయాలలో సంచలనం సృష్టించింది. ఈ వివాదంపై తాజాగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద స్పందించారు. గొడవపై వివరణ ఇచ్చారు. శ్రీశైలం తన తండ్రిని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయడం వల్లే తాను క్షణికావేశానికి గురైనట్లు వివరణ ఇచ్చారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి ఉగ్రరూపం దాల్చారు. ఉరికించి కొడతామంటూ తనదైన శైలిలో బీఆర్ఎస్ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పై ఎమ్మెల్యే కేపీ వివేకానంద దాడి చేయడంపై సీరియస్ గా రియాక్ట్ అయిన ఆయన.. బీఆర్ఎస్ నేతలకు ఈ విధంగా వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ నేతలకు సంస్కారం ఉందని, అది పక్కన పెడితే బీఆర్ఎస్ నేతలకు పట్టపగలే చుక్కలు కనిపిస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు సంజయ్.
మునుగోడు కాంగ్రెస్ టికెట్ తప్పకుండా తనకే వస్తుందని చలమల కృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే తనకు హైకమాండ్ నుంచి ఈ మేరకు హామీ లభించిందన్నారు. రాజగోపాల్ రెడ్డి వేరే ఎక్కడైనా పోటీ చేయాలని కోరారు.
తెలంగాణ బీజేపీలో కొత్త సమస్య తలెత్తింది. ఇద్దరు అగ్రనేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. ఈ ఇద్దరి నేతల మధ్య సయోధ్య కుదర్చలేక అధిష్టానం తలపట్టుకుంటోంది. ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, బండి సంజయ్‌లు పలు చోట్ల వారి అనుచరులకే టికెట్లు కేటాయించాలంటూ పట్టుపడుతున్నారు. దీంతో కొన్ని సీట్లు అలాగే పెండింగ్‌లో ఉన్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న సమయంలో ఇలా ఇద్దరు అగ్రనేతలు మొండికేయడం బీజేపీ పెద్దలకు తలనొప్పిగా మారింది