Latest News In Telugu Telangana Elections: దూకుడు పెంచిన కాంగ్రెస్.. తెలంగాణలో ఖర్గే, డీకే శివకుమార్ ప్రచారం.. తెలంగాణలో ఈసారి అధికారం తమదే అంటున్న కాంగ్రెస్ పార్టీ.. మరింత దూకుడు పెంచింది. పార్టీ అగ్ర నేతలను ప్రచార పర్వంలోకి దించింది. ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలంగాణకు వస్తున్నారు. అక్టోబర్ 28, 29 తేదీల్లో చేవెళ్ల, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేపట్టనున్నారు. చేవెళ్ల, పరిగి, తాండూరు, సంగారెడ్డి, నర్సాపూర్, మెదక్ లో వీరు ప్రచారం చేస్తారు. By Shiva.K 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana BJP CM: బీజేపీ గెలిస్తే సీఎం ఆయనేనా? ఆసక్తి రేపుతున్న అమిత్ షా ప్రకటన..! తెలంగాణలో బీజేపీ గెలిస్తే బీసీ అభ్యర్థినే ముఖ్యమంత్రిగా నియమిస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన హాట్ డిస్కషన్‌కు తెరలేపింది. ఒకవేళ బీజేపీ గెలిస్తే సీఎం రేసులో నిలిచేది వీరే అంటూ కె. లక్ష్మణ్, ఈటల రాజేందర్, బండి సంజయ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతమైతే.. బీజేపీలో బలమైన బీసీ నేతలుగా వీరు ముగ్గురు చలామణి అవుతున్నారు. దీంతో వీరిలో ఎవరు సీఎం అవుతారు? అనే చర్చ నడుస్తోంది. By Shiva.K 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: ఆ ఒక్క మాట వల్లే కొట్టాను.. క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే వివేకానంద.. ఓ టీవీ చర్చా కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానంద.. బీజేపీ నేత కూన శ్రీశైలం గౌడ్ పై చేయి చేసుకోవడం రాష్ట్ర రాజకీయాలలో సంచలనం సృష్టించింది. ఈ వివాదంపై తాజాగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద స్పందించారు. గొడవపై వివరణ ఇచ్చారు. శ్రీశైలం తన తండ్రిని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయడం వల్లే తాను క్షణికావేశానికి గురైనట్లు వివరణ ఇచ్చారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. By Shiva.K 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Politics: ఉరికించి కొడతాం.. బీఆర్ఎస్ నేతలకు బండి సంజయ్ సీరియస్ వార్నింగ్..! బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి ఉగ్రరూపం దాల్చారు. ఉరికించి కొడతామంటూ తనదైన శైలిలో బీఆర్ఎస్ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పై ఎమ్మెల్యే కేపీ వివేకానంద దాడి చేయడంపై సీరియస్ గా రియాక్ట్ అయిన ఆయన.. బీఆర్ఎస్ నేతలకు ఈ విధంగా వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ నేతలకు సంస్కారం ఉందని, అది పక్కన పెడితే బీఆర్ఎస్ నేతలకు పట్టపగలే చుక్కలు కనిపిస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు సంజయ్. By Shiva.K 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Munugode: కార్యకర్తలను కాపాడుకున్నా.. మునుగోడు కాంగ్రెస్ టికెట్ నాదే: చలమల సంచలన ఇంటర్వ్యూ మునుగోడు కాంగ్రెస్ టికెట్ తప్పకుండా తనకే వస్తుందని చలమల కృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే తనకు హైకమాండ్ నుంచి ఈ మేరకు హామీ లభించిందన్నారు. రాజగోపాల్ రెడ్డి వేరే ఎక్కడైనా పోటీ చేయాలని కోరారు. By Nikhil 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Bandi vs Etela: సీట్ల కోసం నేతల మధ్య ఆధిపత్య పోరు..తలపట్టుకున్న అధిష్టానం..!! తెలంగాణ బీజేపీలో కొత్త సమస్య తలెత్తింది. ఇద్దరు అగ్రనేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. ఈ ఇద్దరి నేతల మధ్య సయోధ్య కుదర్చలేక అధిష్టానం తలపట్టుకుంటోంది. ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, బండి సంజయ్‌లు పలు చోట్ల వారి అనుచరులకే టికెట్లు కేటాయించాలంటూ పట్టుపడుతున్నారు. దీంతో కొన్ని సీట్లు అలాగే పెండింగ్‌లో ఉన్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న సమయంలో ఇలా ఇద్దరు అగ్రనేతలు మొండికేయడం బీజేపీ పెద్దలకు తలనొప్పిగా మారింది By Bhoomi 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: డబ్బుల పంపిణీని కట్టడి చేయండి.. ఈసీకి ఎంపీ ఉత్తమ్ ఫిర్యాదు తెలంగాణలో అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ పార్టీ అడ్డదారులు తొక్కుతోందని ఆరోపించారు ఎంపీ ఉత్తమ్. ఎన్నికల వేళ అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. 2018లోనూ ఇలాగే వ్యవహరించారని, ఇప్పుడూ అలాగే చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పథకాల పేరుతో డబ్బులను నేరుగా ప్రజల ఖాతాల్లోనే జమ చేస్తోందని, ఈ పంపిణీని అడ్డుకోవాలని కోరుతూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు ఎంపీ ఉత్తమ్. By Shiva.K 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu వాసివాడి తస్సాదియ్యా.. పొలిటికల్ పార్టీల పెండ్లి.. శుభలేఖ చూస్తే అవాక్కవ్వాల్సిందే..! కేంద్రం, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ టార్గెట్‌గా కాంగ్రెస్ పార్టీ సంచలన పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మరింత వేడిని రాజేశాయి. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటేనని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్.. ఇప్పుడు ఆ ఆరోపణలకు మరింత మసాలా దట్టించి పోస్ట్ చేసింది. రెండు పార్టీల మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని, త్వరలోనే ఈ రెండు పార్టీలు వివాహం చేసుకోబోతున్నాయంటూ ఓ సెటైరికల్ వెడ్డింగ్ కార్డ్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. By Shiva.K 25 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Politics: కష్టపడి గెలిపిస్తే.. నన్ను కోదాడ ఎమ్మెల్యే ఏం చేశాడో తెలుసా?: చందర్ రావు ఇంటర్వ్యూ గత ఎన్నికల సమయంలో తాను కష్టపడి మల్లయ్య యాదవ్ ను గెలిపిస్తే.. గెలిచిన తర్వాత తనను తీవ్ర అవమానాలకు గురి చేశాడని మాజీ ఎమ్మెల్యే చందర్ రావు ఆరోపించారు. తన లాంటి నిజాయితీ పరులు బీఆర్ఎస్ పార్టీకి అవసరం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. By Nikhil 23 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn