BIG BREAKING: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం!
ఏపీ మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సీబీఐ ఛార్జ్‌షీట్ నుంచి తమ సంస్థ పేరును తొలగించాలంటూ వాన్‌పిక్ దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.
ఏపీ మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సీబీఐ ఛార్జ్‌షీట్ నుంచి తమ సంస్థ పేరును తొలగించాలంటూ వాన్‌పిక్ దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.
మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావులకు తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్యలకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది.
ఇటీవల హైదరాబాద్‌లో వరుసగా విద్యుత్ కేబుల్ వైర్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వ వైర్లను తొలగించాలని ఆదేశించింది. దీంతో చాలా చోట్ల ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ఈ అంశంపై భారతి ఎయిర్టెల్ తెలంగాణ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం నియమించిన కమిషన్ ఇచ్చిన నివేదికపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టును కేసీఆర్ హైకోర్టులో సవాల్ చేశారు. రిపోర్ట్ అంతా తప్పుల తడక అని ఆరోపిస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
ఫీజులు పెంచుకునేందుకు అనుమతివ్వాలని పిటిషన్ దాఖలు చేసిన తెలంగాణ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఆ పిటిషన్ ను కొట్టివేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. ఫీజుల పెంపు విషయమై టీఏఎఫ్ఆర్సీ నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.
సుప్రీం కోర్టు కొలీజియం దేశవ్యాప్తంగా ఉన్న పలు హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి సిఫార్సు చేసింది. CJI బీఆర్ గవాయ్ నేతృత్వంలోని 11 హైకోర్టులకు చెందిన 21 మంది జడ్జిల బదిలీకి కొలీజియం ప్రతిపాదించింది. తెలంగాణ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు కూడా బదిలీ అయ్యారు.
అజారుద్దీన్ కి హైకోర్టులో ఊరట లభించింది. ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్‌కి అజారుద్దీన్ పేరు తొలగించవద్దని హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్ క్రికెట్ సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరింది.
గ్రూప్-1 నియామకాల విషయంలో టీజీపీఎస్సీకి తెలంగాణ హైకోర్టు బిగ్‌షాకిచ్చింది. గ్రూప్ 1 పరీక్ష పై అప్పీల్ చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన మద్యంతర ఉత్తర్వులపై టీజీపీఎస్సీ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను ధర్మాసనం నిరాకరించింది.