AP News: టీడీపీలో చేరిన హీరో నిఖిల్..!
సినీహీరో నిఖిల్ టీడీపీలో చేరారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో సైకిల్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నారా లోకేష్ కండువా కప్పి నిఖిల్ ను పార్టీలోకి ఆహ్వానించారు.
సినీహీరో నిఖిల్ టీడీపీలో చేరారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో సైకిల్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నారా లోకేష్ కండువా కప్పి నిఖిల్ ను పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతపురం జిల్లా గుంతకల్ టీడీపీలో నిరసనలు భగ్గుమన్నాయి. జయరాంకి టికెట్ కేటాయింపుపై జితేంద్ర గౌడ్ వర్గీయులు ఆగ్రహించారు. దీంతో టీడీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పార్టీ కార్యాలయంలోని టీడీపీ జెండాలు, పత్రాలు, కార్యాలయ బోర్డులను పెట్రోల్ పోసి తగలబెట్టారు.
అనంతపురం టీడీపీలో అసంతృప్తి భగ్గుమన్నది. టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అనుచరులు టీడీపీ కార్యాయంలో బీభత్సం సృష్టించారు. కార్యాలయ ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. టీడీపీ డబ్బులకు అమ్ముడుపోయిందని ప్రభాకర్ చౌదరి ఫైర్ అయ్యారు.
మరో 4 ఎంపీ స్థానాలకు, 9 అసెంబ్లీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు లిస్ట్ విడుదల చేసింది. ఈ లిస్ట్ లో చీపురుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా కళా వెంకట్రావు, భీమిలీ నుంచి గంటా శ్రీనివాసరావు కు అవకాశం దక్కింది.
పుట్టపర్తి గడ్డ, టీడీపీ అడ్డ, భారీ మెజార్టీతో గెలుపు ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు టీడీపీ అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి. తన నియోజకవర్గ ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారని..ప్రతి పల్లెల్లోనూ మంచి స్పందన వస్తుందన్నారు.సింధూర రెడ్డి పూర్తి ఇంటర్వ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నర్సరావుపేట పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు సంచలన వ్యాఖ్యలు చేశారు. చిలకలూరిపేటలో బీసీ మంత్రిని మార్చి ఓసీ అభ్యర్థి ఎలా పెట్టారంటూ ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యేలలో చాలా మందిపై వ్యతిరేకత ఉందన్న శ్రీకృష్ణదేవరాయలు పూర్తి ఇంటర్వ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతి నుంచి తప్పకుండా గెలుస్తానంటూ ధీమా వ్యక్తం చేశారు జనసేన-బిజెపి-టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి అరణి శ్రీనివాసులు. తాను గెలవగానే తిరుపతిలో అభివృద్ధి పరుగులు పెట్టిస్తాన్నారు. ఆర్టీవీతో అరణీ శ్రీనివాసులు పూర్తి ఇంటర్వ్యూ కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి.
టీడీపీ, జనసేనకు బిగ్ షాక్ తగిలింది. టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ గోపాల్ యాదవ్ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అలాగే విజయవాడ, విశాఖపట్నం నుంచి పలువురు టీడీపీ, జనసేన నాయకులు వైసీపీలో చేరారు.
టీడీపీ పొత్తు ధర్మాన్ని పాటించలేదంటున్నారు శ్రీకాకుళం బీజేపీ జిల్లా అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వరరావు. పార్లమెంటరీ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో బీజేపీకి అవకాశం రాలేదన్నారు. పార్టీ అధినేతల్లో పొత్తు తప్ప క్షేత్ర స్థాయిలో కేడర్ లో పొత్తు లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.