Ap Ration Card: ఏపీలో రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం!
ఏపీ లో రేషన్ కార్డుదారులకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుభవార్త చెప్పారు. వచ్చే నెల నుంచే రేషన్ కార్డు దారులకు తక్కువ ధరకే కందిపప్పు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఏపీ లో రేషన్ కార్డుదారులకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుభవార్త చెప్పారు. వచ్చే నెల నుంచే రేషన్ కార్డు దారులకు తక్కువ ధరకే కందిపప్పు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఏపీలో వాలంటీర్ వ్యవస్థ పునరుద్ధరణపై కూటమి ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. అయితే పరిమిత సంఖ్యతోనే వాలంటీర్ల వ్యవస్థ కొనసాగించాలని కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. వచ్చే కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనుంది.
AP: అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనంతపురమే కాదు రాష్ట్రవ్యాప్తంగా పేకాట క్లబ్ లు తెరిపించే అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఈ విషయంపై ఇప్పటికే కలెక్టర్ తో మాట్లాడానని తెలిపారు.
ఏపీ కేబినెట్ వాయిదా పడింది. ఆగస్టు 2న జరగాల్సిన కేబినెట్ భేటీ వచ్చే నెల 7న జరగనున్నట్లు సమాచారం. కాగా ఆగస్టు 2న సీఎం చంద్రబాబు శ్రీశైలం ప్రాజెక్ సందర్శనకు వెళ్తున్న నేపథ్యంలో మంత్రివర్గ సమావేశం వాయిదా పడినట్లు సమాచారం.
AP: ఈరోజు కీలక శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. పరిశ్రమలు, ఎక్సైజ్ శాఖలపై అధికారులతో సమీక్షించనున్నారు. పరిశ్రమలు, పెట్టుబడులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నారు. కొత్త ఎక్సైజ్ పాలసీ రూపకల్పనపై సమీక్ష చేయనున్నారు.
వైసీపీనేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తిరుపతి పోలీసులు. బెంగుళూరులో మోహిత్ ను అరెస్ట్ చేశారు. పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 37వ నిందితుడుగా మోహిత్ పేరు ఉంది.
జనసేన పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలకు కీలక పదవులు దక్కాయి.జనసేన పార్టీ కొద్ది రోజుల క్రితం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాసిన విషయం తెలిసిందే. పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను అధికారిక విప్‌లుగా ప్రకటించాలని లేఖలో కోరారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆమె కుప్పానికి వెళ్లారు. కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబుతోనైనా కొట్లాడతానంటూ భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన అవసరంపై ఢిల్లీలో వివిధ పార్టీల నాయకులను కలిసి వివరిస్తామని వైసీపీ అధినేత జగన్ తెలిపారు. రాష్ట్రంలో అరాచక పాలనను ఈ నెల 24న ఢిల్లీలో ఫొటో గ్యాలరీ ద్వారా దేశానికి వివరిస్తామన్నారు. ఈ మేరకు జగన్ తన X ఖాతాలో పోస్ట్ చేశారు.