BRS : బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్ ఫోన్ సీజ్..!
బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిశాంక్ ఫోన్ ను మాధాపూర్ పోలీసులు సీజ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత పోస్టులను సోషల్ మీడియాలో పెట్టినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిశాంక్ ఫోన్ ను మాధాపూర్ పోలీసులు సీజ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత పోస్టులను సోషల్ మీడియాలో పెట్టినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయాయి. ఈ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో కొత్త ఫీడ్ లోడ్ కాకపోవడం, రిఫ్రేష్ కాకపోవడం లాంటి సమస్యలు నెటీజన్లు ఎదుర్కొంటున్నారు. దీంతో ట్విట్టర్ వేదికగా నెటీజన్లు.. మెటా నెట్‌వర్క్‌కు ఫిర్యాదులు చేస్తున్నారు.
సోషల్ మీడియాను అత్యంత సమర్ధవంతంగా వాడుకోమంటే బీజేపీ, ప్రధాని మోదీ తర్వాతనే ఎవరైనా. ఇప్పుడు ఇందులో ఒక అడుగు ముందు వేశారు ప్రధాని మోదీ. నమో ఇన్ తెలుగు అనే ట్విట్టర్ అకౌంట్‌ను మొదలుపెట్టి అందులో ఏఐ ద్వారా తన ప్రసంగాలన్నింటినీ తెలగులో వినండి అని చెబుతున్నారు.
లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. అంతకు ముందు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికల ప్రచారాల్లో ఎవరెరవరు ఎంతెంత ఖర్చు పెట్టారు అని చూస్తే అందరికంటే బీజేపీ, వైసీపీనే అని తేలింది. మెటా యాడ్ లైబ్రరీ ప్రకారం ఈ విరాలను సేకరించారు.
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిందంటూ వైరల్ అవుతున్న వార్తలను వరలక్ష్మి శరత్‌కుమార్ ఖండించారు. డ్రగ్స్ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని, ఎలాంటి సమన్లు, ఫోన్ కాల్స్ రాలేదని స్పష్టం చేశారు. మీడియా సంస్థలు విలువైన జర్నలిజాన్ని కాపాడాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో ట్రోలింగ్ భూతం అమాయకులను మింగేస్తోంది. సామాన్యులకు చావు డప్పు మోగిస్తున్నారు సోషల్ మీడియా సోమరిపోతులు. విచక్షణారహితంగా.. అసభ్యకరంగా.. ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోతున్న ట్రోలింగ్ సైకోలను కట్టడి చేయకపోతే భవిష్యత్ తరాల్ని మానసిక వికలాంగులుగా చేసేస్తుంది.
బ్రిటన్ రాజకుటుంబం ఆదివారం మాతృదినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్ చిత్రంఒరిజినల్ ఫొటో కాదు..ఎడిట్ చేసిన ఫొటో అంటూ పెద్ద ఎత్తున దుమారం రేగింది.దీంతో బ్రిటన్ రాజకుటుంబం ఆ ఫొటో ఎడిట్ చేసిందే అని అంగీకరించింది. దీని గురించి క్షమాపణలు కోరింది.
ఎన్నికల షెడ్యూల్ గురించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలను ప్రజలెవరు నమ్మోద్దని ఈసీ కోరింది. ఏప్రిల్- మే నెలల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం రంగం సిద్దం చేస్తుంది. అతి త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేస్తామని తెలిపింది.
ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల ప్రీ వెడ్డింగ్ కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ స్టార్ రామ్ చరణ్ ని ఇడ్లీ, వడ అని సంబోధంచడం పై చరణ్ మేకప్ ఆర్టిస్ట్ జెబా హాసన్ దీని గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో చరణ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.