Medaram : మేడారం గద్దెపైకి చేరుకున్న సమ్మక్క
మేడారం మహా జాతరలో కీలక ఘట్టం చోటుచేసుకుంది. చిలకలగుట్ట నుంచి మేడారం గద్దెపైకి సమ్మక్క తల్లి చేరుకుంది. సమ్మక్కను దర్శించుకునేందుకు భక్తులు భారీగా మేడారానికి చేరుకున్నారు.
మేడారం మహా జాతరలో కీలక ఘట్టం చోటుచేసుకుంది. చిలకలగుట్ట నుంచి మేడారం గద్దెపైకి సమ్మక్క తల్లి చేరుకుంది. సమ్మక్కను దర్శించుకునేందుకు భక్తులు భారీగా మేడారానికి చేరుకున్నారు.
మేడారం జాతర సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం స్కూళ్ళకు సెలవులు ప్రకటిస్తోంది. ఇప్పటికే ములుగు జిల్లాలో మూడు రోజులు సెలవులు ఇచ్చిన గవర్నమెంట్ ఇప్పుడు తాజాగా వరంజల్ జిల్లాల్లో స్కూళ్ళకు కూడా రేపు సెలవును ప్రకటించింది.
ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ కుంభమేళా మేడారం జాతర కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను రూపొందించిన విషయం తెలిసిందే. ఇందులో భక్తుల కోసం సమ్మక్క-సారలమ్మ జాతర వివరాలు, ప్రయాణం, సూచనలు లాంటివి ఉంటాయి. ఈ యాప్ తెలుగు, ఇంగ్లీషు భాషల్లో అందుబాటులో ఉంటుంది.
ఈ నెల 21 నుంచి 24 వరకు జరగనున్న మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని.. మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌లు అన్నారు. జాతర నిర్వహణకు రూ.105 కోట్లు కేటాయించామని.. దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు మాకు వీఐపీనేనని పేర్కొన్నారు.