రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్!
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. అలాగే రూ.2 లక్షల లోపు రుణమాఫీని కూడా ఈ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామన్నారు.
BREAKING: రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్న్యూస్
రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతోంది. దసరా నుంచి రైతు భరోసా నగదును అందించేందుకు కార్యాచరణ చేపట్టింది. నిధులు రెడీ చేయాలని ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ ఆదేశాలు ఇచ్చారు.
CM Revanth: త్వరలో ఎకరాకు రూ.15,000.. సీఎం కీలక ప్రకటన
సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. రైతు భరోసా విధివిధానాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఈ పథకం కింద ఏడాదికి ఎకరాకు రూ.15 వేల ఆర్థిక సాయాన్ని అందిస్తామని కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
MLA KTR : రైతుభరోసా ఊసే లేదు.. కేటీఆర్ విమర్శలు
TG: సీఎం రేవంత్ పై విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. రుణమాఫీ అయిన రైతులకన్నా.. కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ ఉన్నాయని అన్నారు. జూన్లో వేయాల్సిన రైతుభరోసా.. జూలై వచ్చినా రైతుల ఖాతాలో ఎందుకు వెయ్యలే అని ప్రశ్నించారు.
Telangana: ప్రజల అభిప్రాయాలే రైతు భరోసా జీవోగా వస్తుంది-భట్టి
రైతుల ఆలోచనల మేరకే రైతు భరోసా పథకం ఉంటుందని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రైతు భరోసాను గత పాలకులు దుర్వినియోగం చేశారని అన్నారు. సాగు యోగ్యమైన భూములకే తమ ప్రభుత్వం భరోసా ఇస్తుందని తెలిపారు. ఆగస్టులోనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ ఇస్తామని చెప్పారు.
Gutha Sukender Reddy: పది ఎకరాల వరకు రైతు భరోసా.. మండలి చైర్మన్ గుత్తా కీలక వ్యాఖ్యలు
TG: రైతు భరోసాపై మండలి చైర్మన్ గుత్తా కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం పది ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తే చాలు అని అన్నారు. సేద్యం చేసే భూములకు మాత్రమే రైతు బంధు ఇవ్వాలని చెప్పారు. రైతు రుణమాఫీ కూడా అర్హులైన వారికే ఇవ్వాలని అన్నారు.
Rythu Bharosa : రైతులకు గుడ్న్యూస్.. రైతుభరోసా నిధులు విడుదల
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. పంటు పెట్టుబడి సాయం కింద రైతులకు అందించే రైతు భరోసా నిధులను వ్యవసాయ శాఖ సోమవారం విడుదల చేసింది. రూ.2 వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేసినట్లు తెలుస్తోంది.
Telangana : రైతుబంధుపై మాటల యుద్ధం.. రేవంత్ VS బీఆర్ఎస్
మే 9లోగా రైతుల భరోసా అందిస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఇస్తుంది రైతు బంధేనని.. రైతు భరోసా కాదని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. రైతు భరోసా అంటే రూ.15 వేలు ఇవ్వాలి.. కానీ సర్కార్ కేవలం రూ.10 వేలు ఇస్తోందని విమర్శించారు.
/rtv/media/media_files/TujzKZ5iZe9AW7TQLx6h.jpg)
/rtv/media/media_files/H2QjVvct2yn1uk6tOQQp.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Rythu-Bandhu-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-30T143608.099.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-1-7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Gutha-Sukender-Reddy-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-57-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-39-jpg.webp)