Russia-Ukraine War: కుప్పకూలిన రష్యా యుద్ధ విమానం.. 65 మంది ఖైదీలు మృతి
రష్యా- ఉక్రెయిన్ సరిహద్దులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రష్యా యుద్ధ విమానం గాల్లో వెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు దుర్మరణం చెందారు.
రష్యా- ఉక్రెయిన్ సరిహద్దులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రష్యా యుద్ధ విమానం గాల్లో వెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు దుర్మరణం చెందారు.
రష్యాలోని ఓ చమురు నిల్వ డిపోపై ఉక్రెయిన్ డ్రోన్ దాడికి పాల్పడటం కలకలం రేపింది. మొత్తం 6వేల క్యూబిక్ మీటర్ల సామర్థ్యం కలిగి ఉన్న నాలుగు చమురు రిజర్వాయర్లు మంటల్లో కాలిపోయాయి. మార్చిలో రష్యాలో అధ్యక్ష ఎన్నకలు జరగనున్న వేళ మరోసారి దాడులు జరగడం కలకలం రేపింది.
2022లో రష్యా-యుక్రెయిన్ యుద్ధ సమయంలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను ఇండియాకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మధ్యలో ఒక నాలుగు గంటలు యుద్ధం నిలిచిపోయింది. రష్యా, యుక్రెయిన్‌తో మోదీ మాట్లాడడం వల్ల అలా నిలిపివేశారని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.
ఉక్రెయిన్‌పై తమ లక్ష్యాల్లో ఎలాంటి మార్పు ఉండదని.. తమ లక్ష్యాలు నెరవేరేవరకు శాంతి నెలకొల్పడం వీలు కాదని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. ఉక్రెయిన్‌కు నాజీల నుంచి విముక్తి కల్పించి.. నిస్సైనికీకరణ జరిగేలా, నాటోలో చేరకుండా తటస్థంగా ఉండేలా చేయడమే తమ లక్ష్యాలని తెలిపారు.
ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో కిమ్‌తో పుతిన్ భేటీ సైనిక ఒప్పందం దిశగా సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఇరు దేశాలపై మరిన్ని ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది.
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ రష్యాపర్యటనకు వెళ్లారు. త్వరలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలవనున్నట్లు సమాచారం. ఇద్దరు శక్తివంతమైన నాయకులు కలుస్తున్నారన్న వార్త ఉక్రెయిన్ గుండెల్లో గుబులు రేకెత్తిస్తోంది. అటు ఇది పాశ్చాత్య దేశాలలో ఉద్రిక్తతను సృష్టించింది. ఇరు దేశాల నేతలు ఎప్పుడు భేటీ అవుతారు..ఎలాంటి అంశాలపై చర్చిస్తారన్న ఉత్కంఠ నెలకొంది.
రష్యాలో పుతిన్ పై తిరుగుబాటు చేసిన ప్రైవేట్ ఆర్మీ వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ మరణించారా? పలు అంతర్జాతీయ వార్త సంస్థలు ఇదే వార్తను ప్రసారం చేస్తున్నాయి.రష్యాలో బుధవారం ఓ ప్రైవేట్ విమానం కూలిపోయింది. విమాన ప్రమాదంలో 10 మంది మృతి చెందినట్లు సమాచారం. అత్యవసర పరిస్థితుల మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ రష్యా వార్తా సంస్థ TASS ఈ సమాచారాన్ని ఇచ్చింది. సమాచారం ప్రకారం, ప్రైవేట్ విమానం మాస్కో నుండి సెయింట్ పీటర్స్బర్గ్ వెళ్తుండగా కూలిపోయింది. విమానంలో ఉన్న మొత్తం 10 మంది మరణించారని రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖ తెలిపింది. పుతిన్‌పై తిరుగుబాటు చేసిన యవ్జెనీ ప్రిగోజిన్ ఈ విమాన ప్రమాదంలో మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.