Rohit Sharma: రికార్డుల వేట షురూ చేసిన భారత్
ప్రపంచ కప్ వేటలో భాగంగా మొదటి సెమీస్ ఆడుతున్న భారత్ శుభారంభం చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న టీమిండియా బ్యాటర్స్ కివీస్ బౌలర్లపై విరుచుకు పడుతున్నారు.
ప్రపంచ కప్ వేటలో భాగంగా మొదటి సెమీస్ ఆడుతున్న భారత్ శుభారంభం చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న టీమిండియా బ్యాటర్స్ కివీస్ బౌలర్లపై విరుచుకు పడుతున్నారు.
టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ వరల్డ్‌కప్ మ్యాచ్‌ల్లో వరుసగా 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించాడు. 2023 వరల్డ్‌కప్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా 9 మ్యాచ్‌ల్లో గెలిచాడు. మరో రెండు మ్యాచ్‌లు రోహిత్ గెలిస్తే ధోనీ రికార్డును సమం చేస్తాడు.
ప్రస్తుత క్రికెట్లో రోహిత్ శర్మ లాంటి బ్యాటర్ ప్రపంచంలోనే లేడని చెప్పుకొచ్చాడు పాక్ లెజెండరీ క్రికెటర్ అక్రమ్. ప్రత్యర్థి బౌలర్ ఎవరైనా సరే లెక్కచేయకుండా పరుగులు రాబట్టే బ్యాటర్ రోహిత్ అని.. కోహ్లీ, రూట్, బాబర్ కంటే ప్రస్తుతం రోహిత్ అత్యుత్తమ బ్యాటర్ అని కొనియాడాడు.
క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. 2015 క్యాలెండర్ ఇయర్లో ఏబీ డివిలియర్స్ 58 సిక్సులు కొట్టగా.. ఈ క్యాలెండర్ ఇయర్లో రోహిత్ ఇప్పటివరకు 59 సిక్సులు బాదాడు.
మా తొలి లక్ష్యం పూర్తయింది అంటున్నాడు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ. మా నెక్ట్స్ టార్గెట్ ఫైనల్స్ అని చెబుతున్నాడు. దీని కోసం ఇప్పటి నుంచే సిద్ధమవుతామని అంటున్నాడు. వరల్డ్ కప్ మొదటి నుంచి టీమ్ ప్లేయర్స్ అందరూ అద్భుతంగా ఆడుతున్నారంటూ పొగడ్తల్లో ముంచెత్తేస్తున్నాడు కెప్టెన్ రోహిత్.
టీమిండియా అదరగొట్టింది. డబుల్ హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌పై మ్యాచ్‌లో 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 230 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కేవలం 129 పరుగులకే ఆలౌట్ అయ్యింది. షమి 4 వికెట్లతో దుమ్మురేపాడు.
వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మ రికార్డుల పరంపర కొనసాగుతోంది. ఇంగ్లండ్‌పై మ్యాచ్‌లో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ సాధించడంతో మరో రికార్డు వచ్చి పడింది. వరల్డ్‌కప్‌లో అత్యధిక సార్లు 50+ స్కోర్ చేసిన ప్లేయర్లలో రోహిత్ సెకండ్ ప్లేస్‌లో నిలిచాడు. 23 ఇన్నింగ్స్‌లలో రోహిత్ 12సార్లు 50+ స్కోరు చేశాడు. సచిన్ 44 ఇన్నింగ్స్‌లో 21 సార్లు 50+ రన్స్ చేశాడు.
ఈ వరల్డ్‌కప్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇస్తున్న మెరుపు ఆరంభాలతో జట్టు విజయాల బాటపడుతోంది. ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న రోహిత్ శర్మ వేగంగా పరుగులు చేస్తుండడంతో తర్వాత బ్యాటింగ్‌కి వస్తున్న ప్లేయర్లపై ఒత్తిడి తగ్గుతోంది. దీంతో వారు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసుకుంటూ జట్టును గెలిపిస్తున్నారు.