తెలంగాణలో సక్సెస్.. హర్యానాలో ఫెయిల్.. కాంగ్రెస్ చేసిన బిగ్ మిస్టేక్ అదే!
హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి అంతర్గత కుమ్ములాటలే ప్రధాన కారణమని తెలుస్తోంది. తెలంగాణలో అగ్రనేతలందరినీ ఒకే తాటిపై నడిపించిన హస్తం పార్టీ.. హర్యానాలో మాత్రం విఫలమైందన్న టాక్ నడుస్తోంది. దీంతో గెలిచే అవకాశం ఉన్నా.. అధికారానికి దూరమైందన్న చర్చ సాగుతోంది.
Malla Reddy : సీఎం రేవంత్ రెడ్డితో మల్లారెడ్డి భేటీ!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి మల్లారెడ్డి కలిశారు. తన మనవరాలి వివాహానికి ఆహ్వానించారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి, మల్లారెడ్డి మధ్య మాటల యుద్ధం.. ఆ తర్వాత మల్లారెడ్డిపై ఆక్రమణల ఆరోపణలు, కూల్చివేతల నేపథ్యంలో వీరి భేటీ ఆసక్తికరంగా మారింది.
వాహనదారులకు రేవంత్ సర్కార్ బిగ్ షాక్.. అవన్నీ ఇక స్క్రాప్‌కే!
సొంత వాహనాలను 15ఏళ్లు దాటిన తర్వాత స్క్రాప్‌కు అప్పగించాలని తెలంగాణ రవాణాశాఖ కమిషనర్ ఇలంబత్రి సూచించారు. కచ్చితంగా స్క్రాప్ పాలసీలో చేరాలని లేదని.. వాహనాలు స్క్రాప్‌కి పంపకుండా రిజిస్ట్రేషన్ మళ్లీ చేసుకోవాలంటే అదనంగా ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందన్నారు.
Big Breaking: మంత్రివర్గం నుంచి కొండా సురేఖ ఔట్!
కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని హైకమాండ్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరిగిన డ్యామేజ్ ను కంట్రోల్ చేయడానికి ఇంతకు మించిన ఆప్షన్ లేదని రేవంత్ కు స్పష్టం చేసినట్లు సమాచారం.
హైదరాబాద్ ను కాపడడానికే హైడ్రా.. ఫామ్ హౌజ్ కోసం కేటీఆర్ కుట్ర: రేవంత్
హైదరాబాద్ ను కాపడడానికే హైడ్రా, మూసీ ప్రాజెక్ట్ తీసుకువచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కిరాయి మనుషులతో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న హడావుడి తెలంగాణ సమాజం గమనిస్తోందన్నారు. ఫామ్ హౌస్‌లను కాపాడుకోవడానికి కేటీఆర్ పేదల ముసుగు అడ్డం పెట్టుకుంటున్నారని మండిపడ్డారు.
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వే.. నేటి నుంచి ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. ప్రజలందరు సులభంగా సేవలు పొందేందుకు ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వేను అమల్లోకి తీసుకురానున్నారు. ఈ కార్డుల సర్వేను సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సికింద్రాబాద్‌లో హాకీ మైదానంలో ప్రారంభించనున్నారు.
/rtv/media/media_files/HppAzRQhCFOsq0Z3Te3W.jpg)
/rtv/media/media_files/3lDdg8OVuKQRUBj9m3ps.jpg)
/rtv/media/media_files/2rlPh54qXKTd8GbBSMUE.jpg)
/rtv/media/media_files/0XiDR8CgjFAOEl55MDgL.jpg)
/rtv/media/media_library/698f90eee789fd7c3cbc8f867bfcd157a2c9d083d115b4dc98e557626c09c8c8.jpg)
/rtv/media/media_files/ZtH42Z3IXfjKJOwT89PK.jpg)