Razakar movie: 'రజాకార్' సినిమా బ్యాన్? ముదురుతున్న వివాదం..!
'రజాకార్' మూవీని నిషేధించాలని బీఆర్ఎస్ వాదిస్తుండగా.. ఎందుకు బ్యాన్ చేయాలో చెప్పాలని బీజేపీ కౌంటర్ అటాక్ చేస్తోంది. రజాకార్ మూవీ గురించి సెన్సార్ బోర్డు దృష్టికి తీసుకెళ్లాలన్న కేటీఆర్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు ఎమ్మెల్యే రాజాసింగ్. నిజాం హయాంలో మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఎంతమందిని చంపాడో మీ నాన్న చెప్పలేదా అని ప్రశ్నించారు. అటు చిల్లర సినిమా తీస్తూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా బీజేపీ బిహేవ్ చేస్తుందని కేటీఆర్ ఫైర్ అయ్యారు.