Rajinikanth: ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్ !
సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసుపత్రిలో చేరారు. ఆయన గుండెకు సంబంధించి పలు వైద్య పరీక్షలను వైద్యులు మంగళవారం చేయాల్సి ఉండటంతో సోమవారం రాత్రి చెన్నైలోని ఓ ఆసుపత్రిలో ఆయన చేరారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసుపత్రిలో చేరారు. ఆయన గుండెకు సంబంధించి పలు వైద్య పరీక్షలను వైద్యులు మంగళవారం చేయాల్సి ఉండటంతో సోమవారం రాత్రి చెన్నైలోని ఓ ఆసుపత్రిలో ఆయన చేరారు.
కోలీవుడ్ సీనియర్ హీరో రజినీకాంత్ ఓ రిపోర్టర్ పైమండి పడ్డారు. తాజాగా ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన ఆయన్ని తమిళనాడు ప్రస్తుత రాజకీయాల గురించి ఓ విలేకరి ప్రశ్నించాడు. దాంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఆయన.. తనను అలాంటి ప్రశ్నలు అడగొద్దని అన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
రజినీకాంత్ 'వేట్టయాన్' మూవీ నుంచి వినాయక చవితిని పురస్కరించుకొని ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. సినిమాలో 'అర్థమైందా' అంటూ సాగే పాటను సెప్టెంబరు 9న రిలీజ్ చేయనున్నట్టు పోస్టర్ ద్వారా తెలిపారు. అందులో రజినీకాంత్ మాస్ లుక్ ఆకట్టుకుంది. అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
రజినీకాంత్ 'జైలర్' మూవీకి సీక్వెల్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సీక్వెల్ కి సంబంధించి డైరెక్టర్ నెల్సన్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. స్క్రిప్ట్ అంతా ఫైనల్ అయిపోయింది. ప్రొడక్షన్ హౌజ్ త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తుందని అన్నాడు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
రజినీ కాంత్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'కూలీ'. ఈ చిత్రంలో టాలీవుడ్ అగ్రనటుడు నాగార్జున ఓ కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో నాగార్జున సైమన్ అనే పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిపారు.
హీరోయిన్ మేఘా ఆకాశ్ త్వరలోనే పెళ్లి పీటలేక్కబోతోంది. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ రజినీకాంత్‌ను చెన్నైలోని ఆయన నివాసంలో కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. తమ పెండ్లికి రావాల్సిందిగా కోరుతూ సూపర్ స్టార్ కు ఆహ్వానం అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నటుడు రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. డీఎంకే పార్టీ ఒక మర్రి చెట్టు లాంటిదని, ఎలాంటి తుఫాన్ వచ్చినా ఆ చెట్టును కదిలించలేదని ఆయన అన్నారు. అయితే, హీరో విజయ్ కొత్త పార్టీని ఉద్దేశించే రజనీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు చర్చ జరుగుతోంది.
రజనీకాంత్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'వెట్టయాన్’. తాజాగా మేకర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. అక్టోబర్ 10న విడుదల కానున్నట్లు తెలిపారు. అదేరోజు సూర్య 'కంగువా' కూడా రిలీజ్ కాబోతుంది. దీంతో ఈ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ వార్ జరగనున్నట్లు చర్చ మొదలైంది.
విజయ్‌సేతుపతి నటించిన ‘మహారాజ’ సినిమాను రజినీకాంత్ ఇటీవలే వీక్షించారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ ను తన నివాసానికి ఆహ్వానించి ప్రశంసించారు. ఆ సమయంలో రజనీతో దిగిన ఫోటోలను దర్శకుడు నిథిలన్ స్వామినాథన్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు..