Telangana: 117 గ్రామాలకు రాకపోకలు బంద్!
గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల తెలంగాణలోని చాలా ఊర్లకు సంబంధాలు తెగిపోయాయి. పలు జిల్లాల్లోని గ్రామాలకు వెళ్లే రోడ్లు దెబ్బతినడం వల్ల సుమారు 117 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి.
గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల తెలంగాణలోని చాలా ఊర్లకు సంబంధాలు తెగిపోయాయి. పలు జిల్లాల్లోని గ్రామాలకు వెళ్లే రోడ్లు దెబ్బతినడం వల్ల సుమారు 117 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి.
ఏపీ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక చర్యల్లో జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులు అధికారులకు సాయంగా ఉండాలని పవన్ పిలుపునిచ్చారు.
ఆదివారం అర్థరాత్రి 12.30-2.30 గంటల మధ్య కళింగపట్నం సమీపంలో వాయుగుండం తీరం దాటినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర మీద ఆవరించి బలహీనపడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
మోకాలి లోతు నీటిలో జొమాటో డెలివరీ ఏజెంట్ ఒకరు ఫుడ్ ని డెలివరీ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆ డెలివరీ బాయ్ మీద ప్రశంసలు కురుస్తున్నాయి. ఆయనకు జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ అతనికి రివార్డ్ ఇవ్వాలని కోరుతున్నారు.
తెలంగాణకి వర్షసూచన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రోడ్లపై నీళ్లు నిలవకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉండాలని గ్రేటర్ సిబ్బందిని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఆదేశించారు.
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ ఎలా ఉండనుందో వాతావరణ కేంద్రం నివేదికను విడుదల చేసింది. హైదరాబాద్ తో పాటు ఏపీలోని విజయవాడ, తిరుపతి, వైజాగ్ లో వర్షాలు పడే అవకాశాలున్నట్లు అధికారులు వివరించారు.
మూడురోజులుగా కురుస్తున్న వర్షాలతో గుజరాత్ మునిగిపోయింది. ఇక్కడ అనేక ప్రాంతాలు వరదల్లో చిక్కుకుపోయాయి. దీంతో మొత్తం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికి 29మంది మరణించారు.