Cyclone: తీవ్ర తుఫానుగా మారనున్న వాయుగుండం..తీరం దాటేది ఎప్పుడంటే!
పశ్చిమ మధ్య బంగాళాఖాతాల్లో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతం ఈశాన్యం వైపునకు కదిలి మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఇది శనివారం నాటికి తీవ్ర తుఫానుగా మారనుందని వాతావరణశాఖ పేర్కొంది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతాల్లో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతం ఈశాన్యం వైపునకు కదిలి మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఇది శనివారం నాటికి తీవ్ర తుఫానుగా మారనుందని వాతావరణశాఖ పేర్కొంది.
రాగల రెండ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మియాపూర్, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈ నెల 23 వరకూ ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈరోజు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్, లక్నో జెయింట్స్ మ్యాచ్ షెడ్యూల్ ఉంది. అయితే ఈరోజు కూడా వర్షం పడే సూచనలు ఉండడం...దానికి తోడు నిన్న పడిన భారీ వర్షానికి స్టేడియం అంతా నీటితో నిండిపోవడంతో ఈరోజు మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది అనుమానంగా మారింది.
చలి కాలం మొదలై చాలా రోజులు అయినప్పటికీ..మళ్లీ స్లో మోషన్ లో ఎంట్రీ ఇచ్చి నగర వాసులను ఇబ్బంది పెడుతున్నాడు వరుణుడు. హైదరాబాద్ లో ఉదయం నుంచి అమీర్‌పేట్, కృష్ణానగర్ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. దీంతో స్కూళ్లు, ఆఫీసులకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియా-నెదర్లాండ్స్ టీమ్‌ల మధ్య జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రాగల మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ఆసియా కప్ సూపర్-4లో భాగంగా ఈరోజు భారత్-శ్రీలంకల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ రెండు జట్లకు చాలా ఇంపార్టెంట్. అయితే కొలంబోలో ఇవాళ కూడా 60శాతం వర్షం పడే అవకాశం ఉంది.