Prakash raj: చేసిందేమి లేదంటూ.. మా ప్రెసిడెంట్ పై ప్రకాష్ రాజ్ ఫైర్!
"మా" ప్రెసిడెంట్ గా ఎన్నికైన తరువాత మంచు విష్ణు చేసింది ఏమి లేదు అంటూ నటుడు ప్రకాష్ రాజ్ ఆయన పై విమర్శలు చేశారు. కనీసం "మా"బిల్డింగ్ కూడా నిర్మించలేదని పేర్కొన్నారు.
"మా" ప్రెసిడెంట్ గా ఎన్నికైన తరువాత మంచు విష్ణు చేసింది ఏమి లేదు అంటూ నటుడు ప్రకాష్ రాజ్ ఆయన పై విమర్శలు చేశారు. కనీసం "మా"బిల్డింగ్ కూడా నిర్మించలేదని పేర్కొన్నారు.
ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి చాలా దమ్ముండాలి. ఎవరిని నొప్పించకుండా ఉండేలా నాలుగు మాటలు మాట్లాడి వెళ్ళిపోతే గొప్పేముంటుంది. ప్రకాష్ రాజ్ అని ఎలా అనిపించుకుంటారు. ఎవరైనా, ఏ విషయమైనా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడడం, ఎవ్వరినీ లెక్క చేయకపోవడం ఒక్క ప్రకాష్ రాజ్ మాత్రమే చేయగలడు. ఇదే ఆటిట్యూడ్ తో మళ్ళీ టాలీవుడ్ లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకోవడం.. తెలుగు సినిమాలకు జాతీయస్థాయిలో పేరు ప్రఖ్యాతలు వచ్చిన నేపథ్యంలో మైత్రి మూవీస్ అధినేతలు ఒక పార్టీని ఏర్పాటు చేశారు. అందులో ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
నటుడు సిద్ధార్థకు ప్రకాశ్‌రాజ్ కర్ణాటక ప్రజల తరపున సారీ చెప్పారు. సినిమా చిత్త (కన్నడంలో చిక్కు) ప్రచారం కోసం హీరో సిద్ధార్థ బెంగళూరు వచ్చారు. అయితే మీడియా సమావేశంలో ఆయన మాట్లాడడం ప్రారంభించడానికి ముందే కన్నడ అనుకూల సంస్థల సభ్యులు ఆటంకం కలిగించారు. దీంతో సిద్ధార్థ తన ఫ్యాన్స్ కు బై చెప్పి కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు.
చంద్రయాన్ 3 మీద ట్వీట్ చేసి ట్రోలింగ్ కు గురయ్యారు నటుడు ప్రకాశ్ రాజ్. రెండు రోజుల నుంచి ఆయనను నెటిజన్లు ఏకిపారేస్తున్నప్పటికీ ఆయన మాత్రం తగ్గేదేలే అంటూ ఇంకా రెచ్చిపోతున్నారు. తన మీద వచ్చిన ట్రోలింగ్స్ కు గట్టిగా సమాధానం చెబుతున్నారు.