Brazil Plane Crash: ఇళ్లను ఢీకొట్టి కుప్పకూలిన విమానం..10 మంది మృతి!
బ్రెజిల్ లో ఓ చిన్న విమానం ఇళ్లను ఢీకొట్టి కూలిపోవడంతో సుమారు 10 మంది ప్రయాణికులు మృతిచెందారు.మరో 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పర్యాటక పట్టణమైన గ్రామడోలో ఈ ఘటన జరిగింది.
రెబెల్స్ చేతుల్లో సిరియా అధ్యక్షుడి మృ*తి | Syrian President Assad Ki*lled In Plane Crash? | RTV
Plane Crash: నేపాల్ లో టేకాఫ్ అవుతుండగా కుప్పకూలిన విమానం.. అందులో 19 మంది!
నేపాల్‌లోని ఖాట్మండులో ఘోర ప్రమాదం జరిగింది. ఎయిర్‌పోర్ట్‌లో విమానం టేకాఫ్ అవుతుండగా ఒక్కసారిగా కుప్ప కూలింది. ప్రమాద సమయంలో విమానంలో 19 మంది ప్రయాణికులున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది.
Flight Accident: నడిరోడ్డు మీద కూలిన విమానం...ముగ్గురి మృతి!
పారిస్ లో ఓ చిన్న విమానం నడి రోడ్డుపై కూలిపోయింది. తక్కువ ఎత్తులో ఎగురుతుండగా ఓ విద్యుత్ తీగ తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు.
Plane Crash in Russia : రష్యాలో కూలిన కార్గో విమానం..వైరల్ వీడియో..!
రష్యాలో సైనిక కార్గో విమానం మంగళవారం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. విమానం ఇంజన్లో మంటలు చెలరేగడంతో కూలిపోయింది.ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 15 మంది ఉన్నారు. ఇవానోవో ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Plane Crash: గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. చివరికీ
కెన్యాలోని విల్సన్ విమానశ్రయంలో టేకాఫ్ అయిన సఫారీలింక్ ఏవియేషన్ ఫ్లైట్.. మరో చిన్నపాటి శిక్షణా విమానం ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో శిక్షణా విమానం కుప్పకూలింది. దీంతో అందులో ఉన్న ఇద్దరు పైలట్లు మృతి చెందారు. ఇక సఫారీలింక్ ఏవియేషన్ ఫ్లైట్‌ను సురక్షితంగా ల్యాండ్ చేశారు.
Plane: ఘోరం.. ఇంటిపైనే కూలిన విమానం.. పూర్తిగా కాలిపోయిన ఇల్లు
అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ ఇంటిపై చిన్న విమానం కూలింది. ఈ ప్రమాదంలో ఆ ఇల్లు పూర్తిగా కాలిపోగా.. మరో మూడు ఇళ్లు ధ్వంసమయ్యాయి. మృతుల సంఖ్యను అధికారులు ఇంకా వెల్లడించలేదు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.
Wagner Group Chief Died : వాగ్నర్ గ్రూప్ చీఫ్ మృతి? రష్యాలో ప్లేన్ క్రాష్.. అసలేం జరిగింది.?
రష్యాలో పుతిన్ పై తిరుగుబాటు చేసిన ప్రైవేట్ ఆర్మీ వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ మరణించారా? పలు అంతర్జాతీయ వార్త సంస్థలు ఇదే వార్తను ప్రసారం చేస్తున్నాయి.రష్యాలో బుధవారం ఓ ప్రైవేట్ విమానం కూలిపోయింది. విమాన ప్రమాదంలో 10 మంది మృతి చెందినట్లు సమాచారం. అత్యవసర పరిస్థితుల మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ రష్యా వార్తా సంస్థ TASS ఈ సమాచారాన్ని ఇచ్చింది. సమాచారం ప్రకారం, ప్రైవేట్ విమానం మాస్కో నుండి సెయింట్ పీటర్స్బర్గ్ వెళ్తుండగా కూలిపోయింది. విమానంలో ఉన్న మొత్తం 10 మంది మరణించారని రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖ తెలిపింది. పుతిన్‌పై తిరుగుబాటు చేసిన యవ్జెనీ ప్రిగోజిన్ ఈ విమాన ప్రమాదంలో మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.
/rtv/media/media_files/2024/12/28/AmKCnmBc5HKhSNX51PeY.jpg)
/rtv/media/media_files/2024/12/23/541y6URmrzMJg4In2xKU.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/plane-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/plane.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/russia-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Flight-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Flight-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/RUSSINA-jpg.webp)