ఆంధ్రప్రదేశ్ Vizag: పోలీసు స్టేషన్ కి తాళం వేసిన మహిళ..సమస్య పరిష్కరించడం లేదని వినూత్న నిరసన! తన సమస్యను పరిష్కారించాలంటూ ఐదు రోజులుగా పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతుంది ఆ మహిళ. కానీ పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడంతో సహనం చచ్చిపోయిన ఆమె ఏకంగా పోలీసు స్టేషన్ కే తాళం వేసి నిరసన తెలిపింది. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో చోటు చేసుకుంది. By Bhavana 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: దండుపాళ్యం బ్యాచ్, వలంటీర్లకు తేడా లేదు: పవన్ కళ్యాణ్ దండు పాళ్యం బ్యాచ్ కు, వలంటీర్లకు తేడా లేదని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. శనివారం పెందుర్తి నియోజకవర్గంలో వలంటీర్ చేతిలో హత్యకు గురైన వృద్ధురాలు వరలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించి.. ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వృద్ధురాలిని వలంటీర్ అత్యంత కిరాతకంగా హత్య చేశాడని విచారం వ్యక్తం చేశారు.కేవలం బంగారు నగల కోసం కిరాతకంగా వ్యవహారించాడని అన్నారు. ఈ కేసులో వలంటీర్ చేసిన ఈ దురాగతాన్ని బయటపెట్టిన పోలీసులకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటివరకు వైసీపీ నాయకులు ఒక్కరు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించలేదని అన్నారు. వారు ప్రాణాలు తీస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. చిన్నపాటి ఉద్యోగం కావాలన్నా, పాస్పోర్టు కావాలన్నా పోలీసు వెరిఫికేషన్ చేస్తారని.. వాలంటీర్ల నియామకంలో మాత్రం ఎలాంటి పోలీసు వెరిఫికేషన్ తీసుకోవడం లేదని అన్నారు. ఇదేమి విధానం అని పవన్ ప్రశ్నించారు. వ్యవస్థలను, శాంతి భద్రతలను కాపాడటం జనసేన బాధ్యత అన్నారు. By E. Chinni 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan Vizag Tour: షెడ్యూల్ ప్రకారం పెందుర్తికి పవన్ కళ్యాణ్.. బాధితురాలి కుటుంబ సభ్యులకు పరామర్శ జనసేన పార్టీ షెడ్యూల్ ప్రకారం పవన్ కళ్యాణ్ విశాఖ పట్నంలోని పెందుర్తి నియోజక వర్గానికి వెళ్లనున్నారు. అక్కడ వలంటీర్ చేతిలో హత్యకు గురైన వృద్దురాలు వరలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. వారితో కొద్దిసేపు మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకోనున్నారు పవన్ కళ్యాణ్. అలాగే అక్కడ చుట్టుపక్కల ప్రజల సమస్యలను తెలుసుకోనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు విశాఖ నగరంలో సీఎన్బీసీ ల్యాండ్స్ ప్రాంతాన్ని పవన్ సందర్శించనున్నారు. By E. Chinni 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn