BIG BREAKING : 90 మంది ఉగ్రవాదులు హతం!
బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ప్రదేశాలపై భారత్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో 90 మంది ఉగ్రవాదులు మరణించారు. హతమైన ఉగ్రవాదుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ప్రదేశాలపై భారత్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో 90 మంది ఉగ్రవాదులు మరణించారు. హతమైన ఉగ్రవాదుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపుదాడులు, ప్రతిగా సరిహద్దుల్లో పాక్ రేంజర్ల కాల్పుల నేపథ్యంలో జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్ ఎయిర్ పోర్టును మూసివేశారు. ఇరుదేశాల సరిహద్దుల్లోని మరో ఐదు ఎయిర్ పోర్టులను కూడా క్లోజ్చేశారు.
9 ఉగ్రస్థావరాలపై భారత్ గురితప్పకుండా కచ్చితత్వంతో దాడి చేసింది. ఇందుకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కు చెందిన ప్రిసిషన్ స్ట్రైక్ వెపన్ పాటు లాయిటరింగ్ మ్యూనిషన్ వెపన్ ను వాడింది. అటాక్ చేయాల్సిన ప్రాంతాలు కోఆర్డినేట్స్ ను ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఇచ్చింది.
భారత్‌ను భరతమాతతో పోల్చగా కశ్మీర్‌ను తలగా భావిస్తారు. భరతమాత నుదుటిపై దాడి చేయడంతో రక్తాన్ని సింధూరంగా భావించి ఆపరేషన్ సింధూర్ పేరు పెట్టారు. అలాగే ఈ దాడిలో భర్తలను కోల్పోయిన మహిళలకు సింబాలిజంగా చూపిస్తూ ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ దాడి చేసింది.
బుధవారం రాత్రి 1.30 గంటలకు 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ వైమానిక దాడి చేసింది. ఈ దాడికి 'ఆపరేషన్ సిందూర్' అని పేరు పెట్టారు. భారత ఆర్మీ.. పాకిస్తాన్‌లోని 4 ప్రదేశాలను, పీఓకేలోని 5 ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతోంది.