ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ-LIVE మరికొద్ది సేపట్లో హైదరాబాద్ బేగంపేటలోని ప్రజా భవన్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. ఇందుకు సంబంధించిన లైవ్ అప్టేట్స్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు ఆ 26 ఎమ్మెల్యే సీట్లలో మాదే విజయం.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ తమతో 26 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెబుతోందని.. వారందరితో రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తే ఆ సీట్లతో తామే గెలుస్తామన్నారు బండి సంజయ్. ఎన్నికలు రావన్న ధీమాతోనే రాజ్యసభ సభ్యత్వానికి కేకేతో రాజీనామా చేయించారన్నారు. By Nikhil 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు మంత్రి పొన్నంను కలిసిన పేపర్ మర్చంట్ అసోసియేషన్ తెలంగాణ పేపర్ మర్చంట్ అసోసియేషన్ కార్యవర్గం ఈ రోజు మంత్రి పొన్నం ప్రభాకర్ ను సచివాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. జులై 28న అసోసియేషన్ అధ్యక్షుడు సంజీవ్ బల్ద్వా ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులో జరిగే సైకిల్ ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. By Nikhil 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TG Politics: మంత్రి శ్రీధర్ బాబుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ.. ఆ 7గురు జంప్? మంత్రి శ్రీధర్ బాబుతో గ్రేటర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, సుధీర్ రెడ్డి, గోపీనాథ్, కృష్ణారావు, వివేకానంద గౌడ్, రాజశేఖర్ రెడ్డి, అరిక పూడి గాంధీ భేటీ అయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసమే అని వారు చెబుతున్నా.. పార్టీ మారేందుకే చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. By Nikhil 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Amith Shah: అమిత్ షాపై కేసు ఉపసంహరణ.. తెలంగాణ పోలీసుల కీలక నిర్ణయం! ఎన్నికల సమయంలో చార్మినార్ పీఎస్ పరిధిలో అమిత్ షాపై నమోదైన కేసును తెలంగాణ పోలీసులు ఉపసంహరించుకున్నారు. ఆయన ఉద్దేశపూర్వకంగా కోడ్ ఉల్లంఘించలేదన్న కారణంతో కేసు ఉపసంహరించుకున్నారు. By Nikhil 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు మంత్రి కోమటిరెడ్డితో అద్దంకి భేటీ! తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కాంగ్రెస్ కీలక నేత అద్దంకి దయాకర్ ఈ రోజు మినిస్టర్ క్వార్టర్స్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ ఇద్దరు నేతల మధ్య విభేదాలు ఉన్నాయన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో వీరి కలయిక కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. By Nikhil 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కే కేశవరావుకు కేబినెట్ హోదా! ఇటీవల బీఆర్ఎస్ ను వీడి సొంతగూడు కాంగ్రెస్ కు చేరిన సీనియర్ నేత కే కేశవరావు తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. By Nikhil 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు నల్గొండ జడ్పీ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ నల్గొండ జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. జడ్పీ చైర్మన్ల పదవీకాలం ఈ నెల 4తో ముగియడంతో.. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ప్రజాపరిషత్ లకు ప్రత్యేక అధికారులను నియమించింది. By Nikhil 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు సిద్దిపేటలో బీఆర్ఎస్వీ నేతల అరెస్ట్ ప్రజా భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్వీ, విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేవారు. విద్యార్థి సంఘం నాయకులను బీఆర్ఎస్ నేతలు కలిశారు. గ్రూప్-1, గ్రూప్-2 పోస్ట్ లను పెంచాలని డిమాండ్ చేశారు. By Nikhil 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn