ఆంధ్రప్రదేశ్ Dowleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల మధ్యలో ఇరుక్కుపోయిన బోటు ధవళేశ్వరం బ్యారేజీ మొదటి గేటు దగ్గర బోటు ఇరుక్కుంది. గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో లంగరు వేసిన ఇసుక బోటు కొట్టుకు వచ్చింది. గేట్ల మధ్య ఇరుక్కుపోయిన బోటును బయటకు లాగేందుకు ఇరిగేషన్ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. By V.J Reddy 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Amazon Prime Day Sale: అమెజాన్ సేల్ లో అదిరే ఆఫర్లు.. ఈ Realme ఫోన్‌పై ఏకంగా రూ.5 వేలకు పైగా డిస్కౌంట్! అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో Realme Narzo 70x 5G స్మార్ట్ ఫోన్ పై రూ.5 వేలకు పైగా డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ వాస్తవ ధర రూ.17,999 కాగా.. వివిధ ఆఫర్లతో రూ.12 వేలలోపే సొంతం చేసుకోవచ్చు. ఈ సేల్ ఈ రోజు మిడ్ నైట్ తో ముగియనుంది. By Nikhil 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss 8 : 'బిగ్ బాస్' సీజన్ - 8 అప్డేట్ వచ్చేసింది.. ప్రోమో అదిరిపోయిందిగా, ఈసారి హోస్ట్ ఎవరంటే ! బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 కు సంబంధించిన తొలి అప్డేట్ వచ్చింది. ఈ సీజన్ లోగోను ప్రోమో రూపంలో రిలీజ్ చేశారు. నాగార్జున ఈసారి కూడా హోస్ట్‌గా కనిపించనున్నారు. స్వయంగా ఆయనే తన ట్విటర్ లో పోస్ట్ పెట్టారు. 'ఇన్ఫినిటీ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం సిద్ధం కండి' అని పేర్కొన్నారు. By Anil Kumar 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Home Minister Anitha: జగన్ పై చర్యలు.. హోంమంత్రి అనిత సంచలన కామెంట్స్! జగన్ ఈ 45 రోజుల్లో 36 రాజకీయ హత్యలు జరిగాయని అంటున్నాడని.. ఆయన చేసిన వ్యాఖ్యలను నిరూపించాలని హోంమంత్రి అనిత డిమాండ్ చేశారు. నిరూపించకపోతే జగన్ పై ఎందుకు చర్యలు తీసుకోకూడదు? అని ప్రశ్నించారు. ప్రభుత్వం పై బురద జల్లే ప్రయత్నం చేస్తే కేసులు పెట్టేందుకు వెనకాడమన్నారు. By Nikhil 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు ఉజ్జయిని మహంకాళికి ఈటల పూజలు బోనాల సందర్భంగా సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఈ రోజు దర్శించుకున్నారు. బతుకమ్మ, ఉగాది ఏ పండుగైన సామూహికంగా, మనిషి జీవన విధానాన్ని ఉట్టిపడే పద్ధతిలో పండుగలు జరుపుకునే గొప్ప సాంప్రదాయం ఉన్న ప్రాంతం తెలంగాణ అని అన్నారు. By Nikhil 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ విద్యుత్ అధికారులకు హ్యాట్సాఫ్ చెప్పిన రైతు- VIDEO పెద్దవాగు ప్రాజెక్టు తెగిపోవడంతో విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో దమ్మపేట మండలం గుమ్మడివల్లి, నందిపాడు, కోయరంగాపురం, 29 గిరిజన ఆవాస గ్రామాలకు విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దీంతో 2 రోజులుగా టీజీఎన్పీడీసీఎల్ అధికారులు, సిబ్బంది అవిశ్రాంతంగా శ్రమించి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. By Nikhil 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి కిషన్ రెడ్డి పూజలు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబంతో కలిసి దర్శించుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బోనాల పండుగ మనకు మాత్రమే ప్రత్యేకమన్నారు. ప్రజలందరినీ చల్లగా చూడాలని మహంకాళి అమ్మవారిని కోరుకున్నానన్నారు. By Nikhil 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఉజ్జయిని మహంకాళికి పొన్నం ఫ్యామిలీ తొలి బోనం బోనాల పండగ సందర్భంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా వెళ్లి తొలి బోనాన్ని సమర్పించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. By Nikhil 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ బోనాల పండగ సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. రేవంత్ రెడ్డి వెంట మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు ఉన్నారు. By Nikhil 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn