నేషనల్ విపక్ష కూటమి కన్వీనర్ పోస్టుపై..... నితీశ్ కుమార్ ఏమన్నారంటే....! బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని పదవిపై తనకు ఎలాంటి ఆసక్తిలేదని ఆయన వెల్లడించారు. తాను ఎలాంటి పదవులు కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని గతంలో పలు మార్లు వెల్లడించానన్నారు. తాను ఎలాంటి పదవులు కోరుకోవడం లేదన్నారు. తాను కేవలం బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఒక తాటిపైకి తీసుకు రావాలని ప్రయత్నిస్తున్నానని చెప్పారు. By G Ramu 28 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn