PF చందాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై UPI ద్వారా నేరుగా పీఎఫ్ విత్డ్రా!
ఈపీఎఫ్ఓ చందాదారులు తమ PF ఖాతాలోని నగదును యూపీఐ చెల్లింపు గేట్వే ద్వారా సులభంగా తమ బ్యాంకు అకౌంట్లోకి బదిలీ చేసుకోవచ్చు. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది.
ఈపీఎఫ్ఓ చందాదారులు తమ PF ఖాతాలోని నగదును యూపీఐ చెల్లింపు గేట్వే ద్వారా సులభంగా తమ బ్యాంకు అకౌంట్లోకి బదిలీ చేసుకోవచ్చు. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది.
బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కలను తొలగించాలని గతంలో తాము జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని దాఖలైన పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.
ఛత్తీస్గఢ్ జైళ్లశాఖ ఖైదీల కోసం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇంటి నుంచి దూరంగా జైల్లో ఉంటున్న ఖైదీలు తమ కుటుంబ సభ్యులను చూసేందుకు వీడియో కాలింగ్ సౌకర్యాన్ని తీసుకొచ్చింది.
మెక్సికోలో మరోసారి కాల్పులు జరగడం కలకలం రేపింది. ప్యూబ్లా రాష్ట్రంలోని తెహ్విట్జింగో మున్సిపాలిటీలో ఓ సాయుధుడు జరిపిన విచక్షణారహిత కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
భారత్లో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఈ హైస్పీడ్ రైలుకు సంబంధించిన తొలి అధికారిక ఫొటోను రైల్వే మంత్రిత్వ శాఖ తాజాగా రిలీజ్ చేసింది.
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రోడ్లపై నమాజ్ చేసే అంశంపై ముస్లింలకు హెచ్చరిక జారీ చేశారు. లక్నోలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రాష్ట్రంలో ఇకనుంచి ముస్లింలు రోడ్లపై నమాజ్ చేయకూడదని ఆదేశించారు.
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై పెళ్లి బృందం వెళ్తున్న ఓ ట్రక్కును కంటైనర్ వాహనం బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
పెట్రోల్, డీజిల్, CNG లాంటి ఇంధన ధరల పెరుగుదల వల్ల ఇప్పటికే సామాన్యులు సతమతమవుతున్నారు. ఈ క్రమంలోనే త్వరలో మరో ఆర్థిక భారం పడనుంది. దేశవ్యాప్తంగా కరెంట్ బిల్లులు పెంచేందుకు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (CEA) కొన్ని కీలక ప్రతిపాదనలు చేసింది.