Russia Ukraine War: 24 గంటల్లో 1,430 మంది సైనికులు హతం
గత 24 గంటల్లో తామ చేసిన దాడుల్లో 1430 మందికి పైగా ఉక్రెయిన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కీవ్‌లో డ్రోన్లు, క్షిపణులు, ఇతర ఆయుధాలను ధ్వంసం చేశామని పేర్కొంది.
గత 24 గంటల్లో తామ చేసిన దాడుల్లో 1430 మందికి పైగా ఉక్రెయిన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కీవ్‌లో డ్రోన్లు, క్షిపణులు, ఇతర ఆయుధాలను ధ్వంసం చేశామని పేర్కొంది.
మహారాష్ట్ర ప్రభుత్వం ఇకనుంచి 1వ తరగతి నుంచే విద్యార్థులకు బేసిక్ మిలటరీ శిక్షణ ఇవ్వనుంది. విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, శారీరక వ్యాయామం వంటి లక్షణాలు పెంపొందించేదుకు బేసిక్ మిలిటరీ శిక్షణ ఇస్తామని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దాదా భూసే తెలిపారు.
భద్రతా దళాలకు సంబంధించిన సమాచారాన్ని ఉగ్ర సంస్థలకు చేరవేస్తున్నారనే ఆరోపణలో జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వీళ్లు ముగ్గురు ప్రస్తుతం జైల్లో ఉన్నారు.
అస్సాంలో ఓ యువకుడు తన తల్లిని అక్రమంగా నిర్బంధించారని ఆమె ఎక్కడుందో తెలియదని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమెను కోర్టులో హాజరుపరచాలని కోరుతూ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు.
కొత్త విద్యా సంవత్సరం 2025-26 లో బీటెక్ ఫస్ట్ ఇయర్ తరగతులు ఆగస్టు 14 నాటికి ప్రారంభించాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (AICTE) ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం తాజాగా అకడమిక్ క్యాలెండర్ షెడ్యూల్‌ను విడుదల చేసింది.
ఫ్రాన్స్‌లో ఛాంపియన్స్ లీగ్ పోటీల్లో పారిస్ సెయింట్-జర్మైన్ ఫుట్‌బాల్ క్లబ్ జట్టు గెలచింది. దీంతో పారిస్ వీధుల్లో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఓడిపోయిన జట్టుతో అభిమానుల మధ్య ఘర్షణలు చెలరేగడంతో ఇద్దరు మృతి చెందారు. 197 మంది గాయపడ్డారు.
జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు అక్కడి పర్యాటక శాఖ మంత్రి మహమ్మద్ రియాస్ నేతృత్వంలో టూరిజం డిపార్ట్మెంట్ స్పాన్సర్ చేసిందని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సురేంద్రన్ ఆరోపించారు.రియాస్ కేరళ సీఎం పినరయి విజయన్ మేనల్లుడే కావడంతో ఈ వ్యవహారం దుమారం రేపుతోంది.
ఆపరేషన్ సింధూర్‌పై స్పందిస్తూ పూణెకు చెందిన షర్మిస్తా పనోలి అనే లా స్టూడెంట్ ఎక్స్‌లో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఒక మతాన్ని టార్గెట్ చేసాలా కించపరిచే వ్యాఖ్యలు చేయడంతో ఆమెపై పోలీసు కేసు నమోదు కాగా ఆమెను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు.