ఆంధ్రప్రదేశ్ Nyayaniki Sankellu: నేడు "న్యాయానికి సంకెళ్లు" పేరుతో టీడీపీ నిరసన.. మరో సారి ఢిల్లీకి లోకేష్.. వివరాలివే! చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఈరోజు రాత్రి 7.గం.లకు "న్యాయానికి సంకెళ్లు" నల్ల రిబ్బన్ లను చేతులకు కట్టుకుని నిరసన తెలియజేయాలని ఏపీ ప్రజలకు నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అప్ చేయాలని కోరారు. ఇదిలా ఉంటే.. చంద్రబాబు కేసుల వ్యావహారం చర్చించడానికి ఈ రోజు మరో సారి ఢిల్లీ వెళ్లనున్నారు లోకేష్. By Nikhil 15 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ KTR: చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్ రియాక్షన్.. బాధనిపించిందంటూ.. చంద్రబాబు ఆరోగ్యం దెబ్బతిన్నదంటూ వస్తున్న వార్తలపై తెలంగాణ ఐటీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. నారా లోకేష్ ట్వీట్ చూసి బాధనిపించిందన్నారు. చంద్రబాబుకు భౌతికంగా థ్రెట్ ఉందని లోకేష్ ట్వీట్ చేశారన్నారు. అదే నిజమైతే చాలా దురదృష్టకరమన్నారు కేటీఆర్. By Nikhil 13 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Health : డేంజర్ లో చంద్రబాబు హెల్త్.. స్టెరాయిడ్స్ ఇచ్చేందుకు కుట్ర..లోకేష్, భువనేశ్వరి సంచలన ప్రకటనలు..!! టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన సతీమణి భువనేశ్వరి, నారా లోకేశ్ సంచలన ప్రకటనలు చేశారు. చంద్రబాబు ఆరోగ్యం ప్రమాదంలో ఉందన్నారు. బాబుకు స్టెరాయిడ్స్ ఇచ్చే కుట్ర జరుగుతుందంటూ ఆరోపించారు. చంద్రబాబుకు అత్యవసర వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైందటూ భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే చంద్రబాబు 5 కిలోల బరువు తగ్గారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా బరువు తగ్గినట్లయితే కిడ్నీలపై ప్రభావం చూపుతుందని వైద్యులు చెప్పారని భువనేశ్వరి తెలిపారు. అంతేకాదు జైలులో సౌకర్యాలు సరిగ్గా లేవని..ఓవర్ హెడ్ నీళ్ల ట్యాంకులు అపరిశుభ్రంగా ఉన్నాయని ఆరోపించారు. చంద్రబాబు ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని...జైల్లోని పరిస్థితులు తన భర్తకు తీవ్రముప్పు తలపెట్టేలా ఉన్నాయంటూ భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. By Bhoomi 13 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara Lokesh: అమిత్ షా తో భేటీలో జరిగిందిదే.. కీలక వివరాలు వెల్లడించిన నారా లోకేష్.. అమిత్ షా తో భేటీలో ఎలాంటి రాజకీయ అంశాలను ప్రస్తావించలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వివరణ ఇచ్చారు. ఈ భేటీలో కేవలం కేసులపై మాత్రమే చర్చించామన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న లోకేష్.. అక్కడ మీడియాతో మాట్లాడారు. అమిత్ షా తో భేటీ సందర్భంగా రకరకాల ప్రచారాలు జరుగుతుండటంతో మీడియా ముందుకు వచ్చారు. By Shiva.K 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ NARA LOKESH:స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నారా లోకేష్ కు ఊరట స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నారా లోకేష్ కు ఊరట అభించింది. ఈ కేసును ఏపీ హైకోర్టు క్లోజ్ చేసేసింది. లోకేష్ ను ముద్దాయిగా కేసులో చేర్చలేదని సీఐడీ చెప్పింది. ముద్దాయిగా లేని వారిని అరెస్ట్ చేయమని కూడా చెప్పింది. By Manogna alamuru 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara Lokech CID Enquiry: రెండో రోజు కొనసాగుతున్న నారా లోకేష్ విచారణ.. ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతారా? ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ రెండో రోజు సీఐడీ విచారణ కొనసాగుతోంది. నిన్న జరిగిన విచారణలో లోకేష్ ఇచ్చిన సమాధానాల ఆధారంగా ఈ రోజు ప్రశ్నలు అడుగుతున్నట్లు తెలుస్తోంది. By Nikhil 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara Lokesh : రెండో రోజు సీఐడీ విచారణకు నారా లోకేష్...ఏం జరగబోతోంది..?? అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను రెండో రోజు సీఐడి విచారించనుంది. నేడు మరోసారి సీఐడీ విచారణకు రావాల్సిందిగా లోకేశ్ ను ఆదేశించింది. కాగా మంగళవారం దాదాపు 6గంటల పాటు లోకేశ్ ను సీఐడీ ప్రశ్నించింది. ఆయన్ను 30 ప్రశ్నలు అడిగినట్లుగా సమాచారం. విచారణకు లోకేశ్ ఏమాత్రం సహరించలేదని సీఐడీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ మరోసారి సీఐడి విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది. ఈ క్రమంలోనే నేడు సీఐడీ ముందు విచారణకు లోకేశ్ హాజరుకానున్నారు. By Bhoomi 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ IRR Case: ఇన్నర్ రింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. దర్యాప్తు అధికారి ఔట్! అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు అధికారిని సీఐడీ మార్చింది. ప్రస్తుతం దర్యాప్తు అధికారిగా ఉన్న ఏఏస్పీ జయరాజు స్థానంలో డీఎస్పీ విజయ భాస్కర్ కు బాధ్యతలు అప్పగించింది. By Nikhil 10 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara Lokesh : లోకేష్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్న ఏపీ సీఐడీ.. అడుగుతున్న క్వశ్చన్స్ లిస్ట్ ఇదే! టీడీపీ మాజీ మంత్రి నారాలోకేశ్ ను తాడేపల్లిలోని సిట్ కార్యాలయంలో సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. ఉదయం 10గంటలకు విచారణ ప్రారంభం అయ్యింది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఇద్దరు సభ్యుల సిఐడి బృందం విచారిస్తోంది. సీఐడి అదనపు ఎస్పీ జయరామరాజు, డీఎస్పీ భాస్కర్ లోకేశ్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సీఐడీ అడిగిన ప్రశ్నలకు లోకేశ్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ గురించి ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇదంతా మీకు తెలిసే జరిగిందా...ముందే సమాచారం ఉందా...డిజైన్ లో ఎందుకు మార్పులు చేశారనే ప్రశ్నలతో లోకేశ్ ను ఉక్కిబిక్కిరి చేస్తున్నారు. By Bhoomi 10 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn