Telangana: లాస్య నందిత మృతికి మూడు కారణాలు..
బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ఈరోజు రోజు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదానికి మూడు ముఖ్యమైన కారణాలున్నాయని చెబుతున్నారు నిపుణులు. అందులో ముఖ్యమైనది సీటు బెల్ట్ పెట్టుకోకపోవడమే అంటున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ఈరోజు రోజు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదానికి మూడు ముఖ్యమైన కారణాలున్నాయని చెబుతున్నారు నిపుణులు. అందులో ముఖ్యమైనది సీటు బెల్ట్ పెట్టుకోకపోవడమే అంటున్నారు.
గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంలో అన్నీ అబద్ధాలు చెబుతున్నారని టీడీపీ సభ్యులు ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలెక్కడ అంటూ సభలో నిలబడి ప్లకార్డులతో నిరసన తెలిపారు. అనంతరం అసెంబ్లీ నుండి వాకౌట్ చేసి బయటకు వచ్చేశారు. బై బై జగన్ అంటూ నినాదాలు చేశారు.
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ ప్రతినిధుల కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. కొన్ని రోజుల క్రితం ప్రసాదంపాడులో జరిగిన ఓ ఘటనపై వల్లభనేని వంశీ మీద కేసు నమోదైంది. ఈ కేసు విచారణకు కోర్టుకు హాజరుకాకపోవడంతో వంశీకి వారెంట్ జారీ చేసింది.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి , బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 8 వ సారి ఎమ్మెల్యేగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. కర్ర సాయంతో ఆయన కార్యాలయానికి వచ్చారు. రెండు నెలల తరువాత అసెంబ్లీకి రావడంతో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం 8 వ సారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 నిమిషాలు దాటిన తరువాత ఆయన స్పీకర్ ఛాంబర్ లో ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకోనున్నారు.
కాంగ్రెస్ లోనికి వెళ్లే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి స్పష్టం చేశారురేవంత్ ను కలవడం గురించి అనవసరంగా రాజకీయం చేస్తున్నారని , ఎన్నికల సమయంలో చేసిన హామీలను, వాగ్దానాలను నెరవేర్చాలనే తాము రేవంత్ ను కలిసినట్లు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు.
వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సొంత పార్టీ మీదే విమర్శనాస్త్రాలు సంధించారు. సొంత పార్టీ నేతలు బిల్లులు రాక ఆస్తులు అమ్ముకుంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.తన భవిష్యత్తు ఏంటి అనేది కాలమే నిర్ణయిస్తుందని తెలిపారు.
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇచ్చిన హామీని నిబెట్టుకున్నారు. తొర్రూరు మండలం గుర్తూరులో సొంత నిధులతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కు భూమిపూజ చేశారు.దీంతో యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగనున్నట్లు ఆమె తెలిపారు.
నన్ను రాజకీయంగా, భౌతికంగా అంతమొందించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఆస్ట్రేలియాకు సంబంధించిన ఓ సంస్థతో నన్ను తుదముట్టించేందుకు ఒప్పందం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.