మహారాష్ట్రలో దూసుకెళ్తున్న కారు.. 57 సర్పంచ్ లు గులాబీ కే!
మహారాష్ట్రలో 130 సర్పంచ్ స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా..అందులో ఏకంగా 57 పదవులను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది.
మహారాష్ట్రలో 130 సర్పంచ్ స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా..అందులో ఏకంగా 57 పదవులను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది.
మహారాష్ట్రలో మరాఠా ఉద్యమం కోసం గత కొన్ని రోజులుగా ఉద్యమం జరుగుతుంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసు అధికారులు 144 సెక్షన్ ను అమలు చేయడంతో పాటు..ఇంటర్నెట్ సేవలను కూడా బంద్ చేశారు.
కోటీన్నర గెలిచి సంబరాల్లో మునిగిపోతున్న సోమనాథ్‌కు డిపార్ట్మెంట్ షాక్ ఇచ్చింది. బెట్టింగ్ యాప్ ద్వారా చాలామంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఆటల వల్ల కొంతమంది ప్రాణాలు పోతుంటే.. మరి కొంతమంది కోటీశ్వరులు అవుతున్నారు.
పూణె-ముంబై రైలు మార్గంలో పెను ప్రమాదం తప్పింది. రైలు పట్టాలపై వేరు వేరు చోట్ల పెద్ద బండరాళ్లు పెట్టారు దుండగులు. రైలు వస్తున్నప్పుడు రాళ్లు కిందపడిపోకుండా సపోర్టుగా మరికొన్ని రాళ్లు పేర్చారు. అయితే, వీటిని గుర్తించిన రైల్వే అధికారులు వెంటనే రాళ్లను తొలగించడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో రైలు ప్రయాణికులందరూ ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఈ మధ్య కాలంలో వరుస రైలు ప్రమాదాలు కలకలం సృష్టిస్తున్నాయి. అయితే, ఇది కేవలం సంఘవిద్రోహుల పనే అంటున్నారు రైల్వే అధికారులు.
ముంబైలోని గోరేగావ్ వెస్ట్‌లోని ఓ భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. ఘటనాస్థలానికి చేరుకున్న 10 అగ్నిమాపక వాహనాలు మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటన గురువారం అర్థరాత్రి జరిగింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.ఈ ఘటనలో 40 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.
మహారాష్ట్ర (maharashtra) ప్రభుత్వాసుపత్రి (govt Hospital) లో ఏం జరుగుతుంది?. గడిచిన 48 గంటల్లో (48 Hours) 31 మంది (31 patients) పేషెంట్లు మరణించారు. కేవలం 24 గంటల వ్యవధిలో 24 మంది మృత్యువాత పడ్డారు.
మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు సంజయ్ దీపక్ రావును అదుపుకి తీసుకున్నట్లు డీటీపీ అంజనీ కుమార్ తెలిపారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. హైదరాబాద్‌లో చిక్సిత పొందుతున్న సంజయ్ దీపక్ రావును తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
మూడోసారి కూడా ఆడపిల్లే (Baby Girl) పుట్టడంతో ఆ కన్నతండ్రి మనసు కర్కశంగా తయారైంది. పుట్టి ఎనిమిది రోజులు అయినా కాకముందే..ఆ బిడ్డ నోటిలో పొగాకు కుక్కి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు.