IT Raids: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తోడల్లుడి ఇంటిపై ఐటీ దాడులు.. 12 గంటలుగా సాగుతున్న సోదాలు
హైదరాబాద్ లో కాంగ్రెస్ నేతలు, వారి సన్నిహితుల నివాసాలే టార్గెట్ గా ఐటీ దాడులు 12 గంటలుగా కొనసాగుతున్నాయి.
హైదరాబాద్ లో కాంగ్రెస్ నేతలు, వారి సన్నిహితుల నివాసాలే టార్గెట్ గా ఐటీ దాడులు 12 గంటలుగా కొనసాగుతున్నాయి.
సింగరేని సంస్థ బాగుపడాలంటే మంచి యాజమాన్యం, మంచి ప్రభుత్వం ఉండాలన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సింగరేణి ఎన్నికలు జరగాలంటే డిసెంబర్ 3న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. సింగరేణి సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. గురువారం నాడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 1వ గనిలో గేట్ మీటింగ్‌లో పాల్గొన్న టీపిసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారు.
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. సొంత నియోజకవర్గం నల్గొండలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చారు కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నల్గొండ బీఆర్ఎస్ మున్సిపల్ వైస్ చైన్మన్ తో పాటు మరో పది మంది కౌన్సిలర్లను హస్తం గూటికి చేర్చారు. ఈ రోజు వారంతా కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
రానున్న ఎన్నికల్లో ఆలేరు నుంచి తప్పకుండా విజయం సాధిస్తానని కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల అయిలయ్య ధీమా వ్యక్తం చేశారు. తనకు టికెట్ కేటాయించిన పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఆర్టీవీకి ఆయన స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు.
కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక విషయాలు బయటపెట్టారు. ఆరు హామీలే కాక రైతులు, విద్యార్థుల కోసం మేనిఫెస్టోలో కాంగ్రెస్ రూపొందించిన పలు స్కీమ్ లను ప్రజల ముందుంచారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, ప్రతి విద్యార్థికీ ఉచితంగా ఇంటర్నెట్.. వంటి అద్భుత పథకాలతో మేనిఫెస్టో తయారు చేశామన్నారు. మేనిఫెస్టో రూపకల్పనలో తాను కూడా భాగస్వామిగా ఉన్నానని తెలిపారు.
గత కొంతకాలంగా పార్టీ మారుతారంటూ వస్తున్న వార్తలపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ఇంతకాలం ఈ అంశంపై మౌనం వహిస్తూ వచ్చిన రాజగోపాల్ రెడ్డి.. ఇప్పుడు తన మౌనాన్ని వీడారు. పార్టీ మార్పు అంశంపై క్లారిటీ ఇచ్చారు.
కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఎంపీ కోమటిరెడ్డి. సిరిసిల్లలో 20వేల డబుల్ బెడ్రూమ్లు కట్టుకున్న కేటీఆర్ ,దత్తత నియోజకవర్గం నల్గొండలో ఎన్ని కట్టారో చెప్పాలని ప్రశ్నించారు. ఏం ముఖం పెట్టుకొని హెలికాఫ్టర్‌లో నల్గొండకు వస్తున్నావ్ కేటీఆర్ అని నిలదీశారు. చివరి శ్వాస వరకు నల్గొండకు సేవ చేయాలనేది తన కోరిక అని చెప్పారు
వేముల వీరేశంను నకిరేకల్ ఎమ్మెల్యేగా గెలిపించాలని ఎంపీ కోమటిరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు రేపటి నుంచి ప్రచారం చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ రోజు కోమటిరెడ్డిని వీరేశం మర్యాదపూర్వంగా కలిసిన సందర్భంగా ఈ వాఖ్యలు చేశారు కోమటిరెడ్డి.
తెలంగాణలో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. నేతల మధ్య విమర్శల పర్వం మొదలైంది. మీ పాలన అదీ అంటే.. మీ పాలన ఇదీ అంటూ పరస్పర పొలిటికల్ యుద్ధానికి దిగుతున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య ట్విట్స్ వార్ గట్టిగా నడుస్తోంది.