Wayanad: వయనాడ్ కు వెళ్తుండగా..మంత్రి వాహనానికి ప్రమాదం!
కేరళలో కొండ చరియలు విరిగిపడిన వయనాడ్ కు వెళ్తున్న క్రమంలో ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వాహనం ప్రమాదానికి గురైంది. దీంతో మంత్రికి స్వల్పగాయాలు అయ్యాయి.
కేరళలో కొండ చరియలు విరిగిపడిన వయనాడ్ కు వెళ్తున్న క్రమంలో ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వాహనం ప్రమాదానికి గురైంది. దీంతో మంత్రికి స్వల్పగాయాలు అయ్యాయి.
కేరళలోని వయనాడ్ ప్రకృతి సృష్టించిన ప్రళయంలో ఇప్పటివరకు 174 వరకు చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే.. వందాలదిగా శవాలు బురద కింద చిక్కుకుపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మృతుల సంఖ్య వేయి దాటే అవకాశం ఉందని తెలుస్తోంది.
కేరళ లోని వయనాడ్ లోని ముండకై ప్రాంతంలో తేయాకు, కాఫీ, యాలకుల తోటల్లో పని చేసేందుకు పశ్చిమబెంగాల్, అస్సాం నుంచి వందల కార్మికులు వలస వస్తుంటారు.వీరిలో దాదాపు 600 మంది వలస కార్మికులు ముండకైలో నివాసం ఉంటున్నారు. నిన్నటి నుంచి వారి జాడ కనిపించడం లేదని అధికారులు వెల్లడించారు.
కేరళలోని వయనాడ్ జిల్లా ప్రకృతి విపత్తులతో అతలాకుతలమైంది. భారీ వర్షం కారణంగా వాయనాడ్ కొండచరియలు విరిగిపడటంతో 108 మంది మరణించారు. కొంతమంది గల్లంతయ్యారు. కేరళ పినరయి విజయన్ జూలై 30, 31వ తేదీలను రాష్ట్రవ్యాప్త సంతాప దినాలను ప్రకటించారు.
కేరళ వయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల కుటుంబాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ,అధికార,ప్రతిపక్ష నేతలు సంతాపం తెలిపారు. మృతి చెందిన వారికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి 50వేలు ఆర్థిక సాయం అందిస్తామని ప్రధాని మోదీ ఎక్స్ వేదికలో ప్రకటించారు.
కేరళలోని వయనాడ్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున భారీ కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు కనీసం 42 మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా కథనాలు తెలిపాయి. ఇంకా కొన్ని వేల మంది మట్టి దిబ్బల కింద చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
వయనాడ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడిన విషయం తెలిసి ఆందోళనకు గురైనట్లు మోదీ తెలిపారు. ప్రమాదంలో గాయపడిన, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేశారు. ఈ ఘటనపై కేరళ సీఎంతో మాట్లాడినట్లు చెప్పారు.
కేరళలోని వయనాడ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మెప్పాడి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున భారీ కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇంకా వందలాది మంది ప్రజలు ఆ భారీ కొండ చరియల కింద చిక్కుకుని ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
రోడ్డు ప్రమాదాలను ఆరికట్టేందుకు కేరళ ప్రభుత్వం సరికొత్త రూల్స్ ను అమల్లోకి తీసుకుని వచ్చింది. ఇక నుంచి బైక్ పై ప్రయాణించే సమయంలో వెనుక సీట్లో కూర్చొన్న వ్యక్తితో మాట్లాడినా నేరంగా పరిగణించాలని కొత్త నిబంధనను అమల్లోకి తీసుకుని వచ్చింది.