Nadendla Manohar: సీఎం జగన్ GER సర్వే ఫలితాలను బయట పెట్టాలి
వైసీపీ ప్రభుత్వంపై జనసేన పీఏసీ ఛైర్మన్ నాదేండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన GER సర్వేను ఎందుకు బయట పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు.
వైసీపీ ప్రభుత్వంపై జనసేన పీఏసీ ఛైర్మన్ నాదేండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన GER సర్వేను ఎందుకు బయట పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు.
నేడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 52వ పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పవన్ పుట్టినరోజు కానుకగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఓజీ టీజర్ ను రిలీజ్ చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీడీపీ ఎన్నికల బరిలో నిలుస్తుందన్న ఆయన బీజేపీతో పొత్తులు కోసం సమయం మించిపోయిందన్నారు. అయితే తెలంగాణలో ఎన్నికల కోసం కమిటీలు వర్కౌట్ చేస్తున్నాయన్నారు. ఇక జనసేనతో పొత్తుకు ఇంకా సమయం ఉందన్నారు చంద్రబాబు నాయుడు.
వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని, ఏపీలో సీఎం జగన్ పాలన అధ్వాన్నంగా ఉందని జనసేన నాయకుడు, సినీ నటుడు పృథ్వీరాజ్ విమర్శించారు. కమెడియన్ పృథ్వీ రాజ్ సొంతంగా దర్శకత్వం వహిస్తూ రూపొందించిన 'కొత్త రంగుల ప్రపంచం' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఖమ్మం జిల్లా బోనకల్ వెళ్లారు. బోనకల్ లో టీవీ ఆర్టిస్ట్ బానోత్ శ్రీనివాస రావు ఇంటికి కొత్త రంగుల ప్రపంచం మూవీ యూనిట్ మొత్తం వెళ్లింది.
చంద్రబాబు, వపన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలు ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. నారా లోకేష్ యాత్రకు ప్రజా స్పందన కరువైందని వెల్లంపల్లి ఆరోపించారు. టీడీపీ ఎంపీలు సైతం యువగళం యాత్రను బహిష్కరించారని విమర్శించారు.
వైసీపీ ప్రభుత్వంపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. శాంతి భద్రతల్లో ఏపీ బీహార్ ని మించిపోయిందని, ఏపీ క్రైమ్ కి అడ్డగా మారిపోయిందని ధ్వజమెత్తారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇక్కడ సహజ వనరుల దోపిడీ ఎక్కువ జరిగిందని.. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి నెలకొంది అని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. ఉత్తరాంధ్రపై వారికున్నది ప్రేమ కాదు.. రాజధాని పెట్టి వ్యాపారం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. తాడేపల్లిలోనే ఎక్కువ క్రైమ్ రేట్ ఉందని.. ఎందుకంటే ముఖ్యమంత్రి అక్కడే ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో కొత్త ప్రభుత్వం రాగానే.. వీరు చేసిన తప్పులు అన్నింటిని బయటకు తీసుకొస్తామన్నారు. నేను ముఖ్యమంత్రి పదవి తీసుకోడానికి.. సంసిద్ధంగా ఉన్నానని చెప్పారు పవన్ కళ్యాణ్.
`నన్ను తిట్టడంలో నీకు మనశ్శాంతి లభించిందా?..కానివ్వండి` అంటూ రిప్లై ఇచ్చారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఉత్తరాంధ్రను డెవలప్ చేస్తూంటే విపక్ష నాయకులు, జనసేన అధ్యక్షుడు పవన్ చూసి ఓర్వలేకపోతున్నారని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆయన అంటున్న మాటలు వింటుంటే ఈ ప్రాంతం అంతా వెనకబడి ఉంటేనే ఆయనకు నచ్చేటట్లుగా ఉందని ఆయన ఆరోపించారు.
విశాఖ దస్పల్లా హోటల్ లో 'జనవాణి' కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇందులో భాగంగా పవన్ ఉత్తరాంధ్ర ప్రజలతో మాట్లాడుతున్నారు. గ్రామంలో వారికి ఉన్న సమస్యలు, ఇబ్బందులు తెలుసుకుంటున్నారు పవన్ కళ్యాణ్.