Breaking : జగన్ కి మరో షాక్.. పార్టీని వీడనున్న మచిలీపట్నం ఎంపీ!
వైసీపీ అధినేతకు మరో షాక్ తగిలింది. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలోకి చేరనున్నట్లు సమాచారం. పేర్ని నానితో బాలశౌరికి గత కొంతకాలంగా వైరం నడుస్తుంది.
వైసీపీ అధినేతకు మరో షాక్ తగిలింది. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలోకి చేరనున్నట్లు సమాచారం. పేర్ని నానితో బాలశౌరికి గత కొంతకాలంగా వైరం నడుస్తుంది.
పవన్ కల్యాణ్‌తో భేటీపై సోషల్ మీడియాలో స్పందించారు అంబటి రాయుడు. పాలిటిక్స్ ను వదిలేద్దామనుకున్నా..కానీ ఫ్రెండ్స్ సలహా ద్వారా పవన్ ను కలిసినట్లు తెలిపారు. ఈ సందర్భంగానే వైసీపీ సిద్ధాంతాలు నచ్చకే పార్టీకి రాజీనామ చేశానంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
తెలంగాణ ఓటర్లు ఏపీలో కూడా ఓటర్లుగా ఉన్నారని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకు ఒకే రోజు పార్లమెంట్ ఎన్నికలు జరపాలని ఈసీని కోరినట్లు తెలిపారు. ఒకే రోజు ఎన్నికలు జరిగితే దొంగ ఓట్లను అరికట్టవచ్చని పేర్కొన్నారు.
ఏపీలో నకిలీ ఓట్ల వివాదాలపై విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సీఈసీ బృందానికి ఫిర్యాదు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. సాక్ష్యాలతో సహా దొంగ ఓట్లపై ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థను ఎన్నికల్లో వినియోగించకుండా చూడాలని కోరినట్లు తెలిపారు.
ఏపీ రాజకీయాల్లో ప్రధాన పార్టీలు అధికారమే లక్ష్యంగా వ్యూహాలు ప్రారంభించాయి. ఇందులో భాగంగా గోదావరి జిల్లాల మీద ఫోకస్ పెట్టాయి. ఇందులో భాగంగా కాపులు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల వేటను ముమ్మరం చేసింది.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని కనిపిస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తాము వైసీపీని సాగనంపుతున్నామని సర్వేల ద్వారా వెల్లడిస్తూనే ఉన్నారు.
రాష్ట్రంలో సామాజికంగా , ఆర్థికంగా, రాజకీయంగా బీసీలను పైకి తీసుకుని వచ్చే బాధ్యత టీడీపీదేనని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బీసీ సోదరుల జోలికి వచ్చే ధైర్యం కూడా ఎవ్వరూ చేయకూడదనే టీడీపీ మేనిఫెస్టోలో కూడా బీసీ రక్షణ చట్టం చేస్తామని హామీనిచ్చినట్లు తెలిపారు.
కొద్ది రోజుల క్రితం జనసేన పార్టీలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ కు పవన్ కల్యాణ్ కీలక బాధ్యతులు అప్పగించారు. జనసేన విశాఖ జిల్లా అర్బన్ పార్టీ అధ్యక్షుడిగా వంశీకృష్ణను నియమిస్తున్నట్లు ప్రకటించారు.
పొత్తుల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో ఒక ఎంపీ సీటుతో పాటు 8 అసెంబ్లీ స్థానాలు అడిగాలని జనసేన భావిస్తోంది. కాకినాడ పార్లమెంట్ స్థానంతో పాటు కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, రాజమండ్రి రూరల్, రాజానగరం, అమలాపురం, రాజోలు, రామచంద్రపురం, మండపేట సీట్లు ఆ లిస్ట్ లో ఉన్నాయి.