ఆంధ్రప్రదేశ్ JanaSena VeeraMahila : స్త్రీ అన్ని విధాలా దగాకి గురవుతుందనేది వాస్తవం: పవన్ కళ్యాణ్ ఆగష్టు 15 సందర్భంగా జనసేన వీర మహిళలతో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం సమావేశమయ్యారు. ప్రజలందరికీ జనసేన పక్షాన స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. మహానుభావులు, మేధావుల త్యాగాలతోనే స్వాతంత్రాన్ని సంపాదించుకున్నామని చెప్పారు. ఇటువంటి చరిత్రలు, మహానుభావులు త్యాగాలు అందరూ తెలుసుకోవాలని సూచించారు. అలాగే పేద, మధ్య తరగతి మహిళలు ఇంటికే పరిమితం కాకూడదని.. సమాజంలో తమ మేధస్సుతో రాణించాలని కోరుకుంటున్నాని చెప్పారు. తాము భవిష్యత్తులో మగువలకు సరైన స్థానం, రక్షణ కల్పిస్తామని చెప్పారు. అతని ఇంట్లో ఆడవాళ్లు, కుటుంబం ఉంది కదా అని గుర్తు చేశారు. స్త్రీల కట్టు, బొట్టును అవమానించినా ప్రభుత్వం పట్టించుకోదా అని... ఈ పాలకులకు రాజకీయమే ముఖ్యమా అని ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దలు, మహిళా కమీషన్ మాట్లాడదన్నారు. దిశ చట్టాలు, స్పందన పెట్టి ప్రయోజనం ఏమిటని నిలదీశారు. . సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్, పొట్టి శ్రీరాములు వంటి వారి స్పూర్తి తో జనసేన బలంగా పోరాటాలు చేస్తుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. By E. Chinni 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: దండుపాళ్యం బ్యాచ్, వలంటీర్లకు తేడా లేదు: పవన్ కళ్యాణ్ దండు పాళ్యం బ్యాచ్ కు, వలంటీర్లకు తేడా లేదని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. శనివారం పెందుర్తి నియోజకవర్గంలో వలంటీర్ చేతిలో హత్యకు గురైన వృద్ధురాలు వరలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించి.. ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వృద్ధురాలిని వలంటీర్ అత్యంత కిరాతకంగా హత్య చేశాడని విచారం వ్యక్తం చేశారు.కేవలం బంగారు నగల కోసం కిరాతకంగా వ్యవహారించాడని అన్నారు. ఈ కేసులో వలంటీర్ చేసిన ఈ దురాగతాన్ని బయటపెట్టిన పోలీసులకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటివరకు వైసీపీ నాయకులు ఒక్కరు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించలేదని అన్నారు. వారు ప్రాణాలు తీస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. చిన్నపాటి ఉద్యోగం కావాలన్నా, పాస్పోర్టు కావాలన్నా పోలీసు వెరిఫికేషన్ చేస్తారని.. వాలంటీర్ల నియామకంలో మాత్రం ఎలాంటి పోలీసు వెరిఫికేషన్ తీసుకోవడం లేదని అన్నారు. ఇదేమి విధానం అని పవన్ ప్రశ్నించారు. వ్యవస్థలను, శాంతి భద్రతలను కాపాడటం జనసేన బాధ్యత అన్నారు. By E. Chinni 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan Vizag Tour: షెడ్యూల్ ప్రకారం పెందుర్తికి పవన్ కళ్యాణ్.. బాధితురాలి కుటుంబ సభ్యులకు పరామర్శ జనసేన పార్టీ షెడ్యూల్ ప్రకారం పవన్ కళ్యాణ్ విశాఖ పట్నంలోని పెందుర్తి నియోజక వర్గానికి వెళ్లనున్నారు. అక్కడ వలంటీర్ చేతిలో హత్యకు గురైన వృద్దురాలు వరలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. వారితో కొద్దిసేపు మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకోనున్నారు పవన్ కళ్యాణ్. అలాగే అక్కడ చుట్టుపక్కల ప్రజల సమస్యలను తెలుసుకోనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు విశాఖ నగరంలో సీఎన్బీసీ ల్యాండ్స్ ప్రాంతాన్ని పవన్ సందర్శించనున్నారు. By E. Chinni 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన.. పార్టీలో చేరిన మాజీ మంత్రి మాజీ మంత్రి పడాల అరుణ జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. పడాల అరుణ మెడలో జనసేన కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు పవన్. ఈ సందర్భంగా జనసేన చీఫ్ మాట్లాడుతూ.. పడాల అరుణ లాంటి సీనియర్ నేతలు జనసేనలో చేరడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవలే తనను పడాల అరుణ కలిశారని పవన్ గుర్తు చేశారు. ప్రజల కోసం తాను పడుతున్న తపనను, పోరాటం పట్ల ఆకర్షితురాలినైనట్లు వెల్లడించారు. మీ పోరాటంలో భాగస్వామ్యం కావాలనుకుంటున్నానని జనసేన పార్టీలో చేరతానన్నారని.. తాను స్వాగతించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. By E. Chinni 10 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైజాగ్ Varahi yatra: పవన్ మూడో దశ వారాహి యాత్రపై సర్వత్రా ఉత్కంఠ.. ఆంక్షలతో టెన్షన్! పవన్ కల్యాణ్ మూడో దశ వారాహి యాత్ర ఇవాళ(ఆగస్టు 10) విశాఖ నుంచి ప్రారంభమవనుండగా.. సాయంత్రం 5గంటలకు జగదంబా సెంటర్లో జనసేన నిర్వహించనున్న సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరోవైపు సభకు పోలీసులు అనుమతి ఇచ్చినా కొన్ని కండీషన్స్ పెట్టారు. ఎలాంటి ర్యాలీలు నిర్వహించకూడదని, పవన్ ని ఎయిర్పోర్ట్ నుంచి ర్యాలీగా రావొద్దని పోలీసులు సూచించారు. ఇక గత దశ వారాహి యాత్రలో వాలంటీర్లను టార్గెట్ చేసిన పవన్.. ఈసారి ఏ స్ట్రాటజీతో రానున్నారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. By Trinath 10 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అడవి బిడ్డల దుస్థితి మారాలి.. ఎమోషనల్ అయిన పవన్ కళ్యాణ్ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరి పుత్రులకు ప్రేమ పూర్వక శుభాకాంక్షలు చెప్పారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కొండకోనలు దాటి రావడానికి ఇష్టపడని ఈ అడవి బిడ్డలకు అనారోగ్యం చేసినా, ప్రసవానికి ఆస్పత్రికి వెళ్ళాలన్నా ఆ బాధలు వర్ణనాతీతమని పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యారు. అడవి బిడ్డలకు విద్య, వైద్యం అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. కొండకోనల్లో నివసిస్తూ సంప్రదయాలను బతికించుకుంటున్నారని తెలిపారు. అడవి తల్లిని నమ్ముకున్న బిడ్డలు, కళ్లా కపటం ఎరుగని మనుషులు మన గిరిజనులని చెప్పారు.. By E. Chinni 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి: పవన్ ఏపీలో ముందస్తు ఎన్నికలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ క్రియాశీలక నేతలతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. డబ్బు తీసుకుని సీట్లు ఇచ్చే సంస్కృతి జనసేనలో లేదన్నారు. By BalaMurali Krishna 04 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు తొలి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన జనసేన.. ఏ నియోజకవర్గం నుంచి అంటే? 2018 సంవత్సరం నుంచి జనసేన పార్టీకే అంకితమై తన వంతు సేవలందిస్తున్న మాజీ స్పీకర్ నాదేండ్ల మనోహార్ తెనాలి నుంచి పోటీ చేస్తారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ ని గెలిపించడం ఎంతో అవసరమని తెనాలి నాయకులకు జనసేనాని.. By E. Chinni 02 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం.. ఎన్నికల వరకూ ఇక అక్కడే!! పవన్ మొత్తానికి మంగళగిరికి షిఫ్ట్ అవుతున్నట్లుగా సమాచారం. ఇక్కడి నుంచే పార్టీకి సంబంధించి కార్యకలాపాలు కొనసాగించాలని ఆయన భావిస్తున్నారట. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీని ఓడించే లక్ష్యంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు పవన్ కళ్యాణ్ స్వయంగా అన్నారు. ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి పార్టీ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్న పవన్ కళ్యాణ్.. By E. Chinni 02 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn