BREAKING: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత!
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఒకవైపు వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని టీడీపీ వ్యూహాలు రచిస్తుంటే.. కీలక నేత ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈరోజు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఒకవైపు వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని టీడీపీ వ్యూహాలు రచిస్తుంటే.. కీలక నేత ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈరోజు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
వైసీపీ సర్కార్‌పై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మరోసారి ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి అప్పుల మీద ఉన్న శ్రద్ద అభివృద్ధిపై లేదని మండిపడ్డారు. ఒక్క పరిశ్రమ లేదు, ఉద్యోగం లేదు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగనన్న కాలనీల నిర్మాణం పేరుతో వైసీపీ సర్కార్ పేదలను వంచిస్తోందని మండిపడ్డారు జనసేన నాదెండ్ల మనోహర్. భూ సేకరణ పేరుతో అవినీతి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న కాలనీల ద్వారా లబ్ధి పొందింది కేవలం జగన్, వైసీపీ ప్రజా ప్రతినిధులు మాత్రమేనని అన్నారు.
కోడి కత్తి కేసు విచారణను ఏపీ హైకోర్టు ఈ నెల 23 కి వాయిదా వేసింది. ఆరోజేనే తమ వాదనలు వినిపిస్తామని నిందితుడు శ్రీను తరుఫున న్యాయవాది సలీం పేర్కొన్నారు.
చచ్చేంత వరకు సీఎం జగన్ తోనే ఉంటానని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ 175 సీట్లు గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు అవినీతిలో పవన్ కి కూడా వాటా ఉందని ఆరోపించారు.
చంద్రమోహన్ మృతిపట్ల పలువురు సినీ సెలబ్రిటీలు, ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ప్రేక్షకుల హృదయాల్లో చంద్రమోహన్ చెరగని ముద్ర వేశారంటూ కేసీఆర్, చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు తమకున్న బంధాన్ని గుర్తు చేసుకుంటూ నివాళి అర్పిస్తున్నారు.
అనకాపల్లి జిల్లాలో పోలీసులు రెచ్చిపోయి ప్రవర్తించారు. ఐడీ కార్డు చూపించమని అడిగినందుకు ఓ సైనికుడిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. పరవాడ సంతలో చోటుచేసుకున్న ఈ ఘటన పెను సంచలనం సృష్టిస్తోంది.
జగన్ అక్రమాస్తుల కేసులపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య వేసిన పిల్ మీద తెలంగాణ హైకోర్టు ఈరోజు విచారణ చేసింది. హరి రామ జోగయ్య పిల్ కు నెంబరు కేటాయించాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశించడమే కాక ప్రతివాదులు జగన్, సీబీఐకి నోటీసులు పంపాలని చెప్పింది.